‘గోవా’ రతన్‌ టాటా స్నేహితుడు!

తాజా వార్తలు

Updated : 19/11/2020 14:48 IST

‘గోవా’ రతన్‌ టాటా స్నేహితుడు!

ఆ పేరు ఎందుకు పెట్టారంటే..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు శునకాలంటే ఎంతో ఇష్టమనే సంగతి అందరికీ తెలిసిందే. ముంబయిలో ఉండే టాటా గ్రూపు ప్రధాన కార్యాలయం ‘బాంబే హౌస్‌’లో.. ఆయన పెంపుడు కుక్కలను ఉంచేందుకు ఏకంగా ఓ అంతస్తునే కేటాయించారు. అయితే వాటిలో గోవా అనే శునకం అంటే టాటాకు ఎంతో ఇష్టమని సన్నిహితులు అంటారు. నలుపు తెలుపుల్లో ఉంటే ఈ కుక్క తన స్నేహితుడని టాటా పలుమార్లు చెప్పారు.

దీపావళి సంబరాల్లో భాగంగా గోవాతో సహా తన పెంపుడు కుక్కలతో కలసి ఉన్న ఫోటోలను రతన్‌ టాటా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా గోవాకు ఆ వింతైన పేరు ఎందుకు పెట్టారని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. తను ఓసారి గోవా వెళ్లినపుడు ఎక్కడి నుంచో వచ్చిన ఓ చిన్న వీధి కుక్క పిల్ల తన స్నేహితుడి కారులోకి ప్రవేశించిందని.. దానిని తనవెంట తీసుకొచ్చానని టాటా వెల్లడించారు. అందుకు గుర్తుగా దాని పేరు గోవా అని పెట్టినట్టు ఆయన వివరించారు. కాగా పెంపుడు శునకాలతో ఉన్నప్పటికీ మాస్క్‌ ధరించడం మరచిపోని ఈ 82 ఏళ్ల  పారిశ్రామిక దిగ్గజం అప్రమత్తతను పలువురు అభినందిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని