సీఎంగారూ..నాన్న టపాసులు కొనివ్వలేదు

తాజా వార్తలు

Updated : 15/11/2020 23:13 IST

సీఎంగారూ..నాన్న టపాసులు కొనివ్వలేదు

మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసిన బాలిక

ముంబయి: ఆర్థిక పరిస్థితుల కారణంగా దీపావళి పండగ జరుపుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ బాలిక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాసింది. ఆరో తరగతి చదువుతున్న ఈ బాలిక రాసిన లేఖకు స్పందన కూడా వచ్చింది. ఆ లేఖ జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టికి వెళ్లగా చిన్నారి కుటుంబానికి నిత్యావసరాలు, మిఠాయిలు, టపాసులు అందించారు.

హింగోలీ జిల్లా తప్తోడా గ్రామానికి చెందిన రైతు కూతురు చిముర్తి తన కుటుంబ పరిస్థితులను వివరిస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు లేఖ రాసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పండగకు టపాసులు తేలేనని తండ్రి అన్నాడని బాలిక ఆ లేఖలో పేర్కొంది. వైరల్‌గా మారిన లేఖ జిల్లా పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు స్పందించారు. బాలిక కుటుంబానికి నగదుతోపాటు నిత్యావసరాలు, వస్త్రాలు, స్వీట్లు, టపాసులు అందించారు. దీంతో ఆ బాలిక కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని