దసరా నాటికి 3,200ఇళ్ల నిర్మాణం పూర్తి: తలసాని

తాజా వార్తలు

Published : 21/08/2020 22:54 IST

దసరా నాటికి 3,200ఇళ్ల నిర్మాణం పూర్తి: తలసాని

హైదరాబాద్‌: హైద‌రాబాద్‌లో దసరా నాటికి మరో 3,200 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామ‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాప్ యాద‌వ్ వెల్లడించారు. దసరా కానుకగా న‌గ‌రంలోని 21 ప్రాంతాల్లో సుమారు 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేప‌ట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల  నిర్మాణ పనుల పురోగతిపై మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసబ్‌ ట్యాంకులోని ప‌శుసంవ‌ర్థక శాఖ కార్యాల‌యంలో స‌మీక్ష స‌మావేశం నిర్వహించారు. స‌మావేశంలో కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం న‌గ‌రంలో 1,144 ఇళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలో రూ.812 కోట్ల వ్యయంతో 7,455 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి వివ‌రించారు. 
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని