ఇవాంక గ్రీటింగ్‌.. మెలానియా ఎక్స్‌ప్రెషన్‌

తాజా వార్తలు

Published : 29/08/2020 01:06 IST

ఇవాంక గ్రీటింగ్‌.. మెలానియా ఎక్స్‌ప్రెషన్‌

 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్‌, ఇవాంకల మధ్య సత్సంబంధాల గురించి ఎన్నడూ సానుకూల వార్తలు రాలేదు. ఈ క్రమంలో గురువారం రాత్రి జరిగిన రిపబ్లికన్‌ నేషనల్ కన్వెన్షన్‌(ఆర్‌ఎన్‌సీ)లో భాగంగా వారిద్దరు ఎదురుపడినప్పుడు మెలానియా ముఖంలో మారిన హావభావాలే అందుకు నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

ఇంతకీ విషయం ఏంటంటే..ఆర్‌ఎన్‌సీలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్  పార్టీ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే పార్టీ నామినేషన్‌ను స్వీకరించారు. ఆ సమయంలో మెలానియా ఆయన చెంతే ఉన్నారు. అదే వేదిక మీద ఉన్న ఇవాంక ఆమెకు ఎదురుగా రాగానే చాలా ఆత్మీయంగా నవ్వారు. అంతలోనే ముఖం మీద నవ్వు మాయమై, కోపంగా ఉన్నట్లు కనిపించారు.  ఈ సందర్భం కాస్తా కెమెరా కళ్లకు చిక్కి, నెట్టింట్లో దర్శనమిచ్చింది. దాంతో ఈ క్లిప్పింగ్‌ను చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. ‘చాలా వింతగా ఉంది’, ‘మెలానియాకు ఇవాంక నచ్చట్లేదు’, ‘వారిద్దరు బా..గానే ఉన్నట్లు కనిపించారు’, ‘ఇవాంకను చూసే మెలానియా కళ్లు తిప్పుకొందా?’ అంటూ రాసుకొచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని