డబుల్‌ డెక్కర్‌ బస్సులో ఫొటోషూట్‌..

తాజా వార్తలు

Updated : 15/11/2020 17:06 IST

డబుల్‌ డెక్కర్‌ బస్సులో ఫొటోషూట్‌..

అవకాశం కల్పిస్తున్న కేరళ ఆర్టీసీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: పుట్టినరోజు వేడుకలు.. వివాహాది శుభకార్యాలు.. ఫంక్షన్లు.. సందర్భం ఏదైనా ఫొటోషూట్లు ఉండాలని నేటి యువత కోరుకుంటోంది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో పెళ్లి కార్డులకు బదులు చిన్నపాటి వీడియోలనే శుభలేఖలుగా పంపించుకుంటున్నారు. దీనికోసం ఫొటోషూట్‌లు, వీడియోషూట్‌లు నిర్వహించుకుంటున్నారు. కానీ ఎప్పుడూ బీచ్‌లు, ఇతర ప్రాంతాల్లోనే కాకుండా క్లాసిక్‌గా పాతకాలపు డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో ఫొటోలు కొత్త అనుభవాన్ని పంచుతోంది. డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో ఫొటోషూట్లకు కేరళ ఆర్టీసీ అవకాశం కల్పిస్తోంది. ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌లకు ఈ బస్సులను అద్దెకిస్తోంది. రోడ్డుపై ప్రయాణిస్తూ కూడా అందులో ఫొటోషూట్‌ నిర్వహించుకోవచ్చు.

చిన్నపాటి పుట్టినరోజు వేడుకలు కూడా ఈ డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో చేసుకోవచ్చు. లండన్‌లో కనిపించే సాయంత్రపు టీ బస్‌ తరహాలో ఈ బస్సులను డిజైన్‌ చేశారు. కింది భాగంలో సీట్లు ఉండి పైభాగంలో పార్టీలు చేసుకునేందుకు ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఫొటోషూట్లు, పుట్టినరోజు వేడుకలకు.. ఇలా దేనికోసమైనా తక్కువ ధరకే బస్సును అద్దెకు తీసుకోవచ్చు. ఇందుకు కేరళ ఆర్టీసీ 8గంటలకు గాను 4వేల రూపాయలను వసూలు చేస్తుంది. అయితే ఈ బస్సులో తిరువనంతపురం నుంచి 50 కిలోమీటర్ల పరిధిలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. డబుల్‌ డెక్కర్‌ బస్సులో నిర్వహించిన తొలి ఫొటోషూట్‌కు అంతర్జాలంలో బాగా ప్రాచుర్యం లభించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని