తెలంగాణలో బాణసంచాపై నిషేధం

తాజా వార్తలు

Updated : 13/11/2020 10:37 IST

తెలంగాణలో బాణసంచాపై నిషేధం

హైదరాబాద్‌: దీపావళి నేపథ్యంలో బాణసంచాపై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. బాణసంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించకుండా తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీ కలెక్టర్లు, సీపీలు,ఎస్పీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే టపాసుల దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా వినియోగాన్ని నిషేధించడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తక్షణం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాణసంచా దుకాణాల మూసివేతకు చర్యలు తీసుకోవాలంది. ప్రజలు, సంస్థలు టపాసులు వినియోగించకుండా చూడాలని పేర్కొంది. జనాన్ని అప్రమత్తం చేస్తూ ముద్రణ, సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేయాలంది. తద్వారా టపాసుల పేలుళ్లను అడ్డుకోవడంతో వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చంది. కోర్టు ఉత్తర్వుల అమల్లో భాగంగా నిషేధానికి తీసుకున్న చర్యలను ఈనెల 19న కోర్టుకు వివరించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని