దిల్లీలోని పరిశ్రమలు సహజవాయువునే వాడాలి

తాజా వార్తలు

Published : 23/12/2020 00:05 IST

దిల్లీలోని పరిశ్రమలు సహజవాయువునే వాడాలి

దిల్లీ: దేశరాజధాని ప్రాంతంలోని పరిశ్రమలన్నీ 2021 జనవరి 31 నాటికి పూర్తిస్థాయిలో సహజవాయువునే వినియోగించాలని వాయునాణ్యతా నిర్వహణ కమిషన్‌ మంగళవారం ఆదేశించింది. దేశరాజధాని ప్రాంతంలోని కాలుష్యానికి పరిశ్రమలు ప్రధాన కారణం అని కమిషన్‌ పేర్కొంది. పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ను వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో వినియోగిస్తారు. ఇది కాలుష్య రహిత ఇంధనం. ఆర్థిక, రక్షణ పరంగా కూడా సురక్షితమైన ఇంధనం. నూతన సంవత్సరం నుంచి దిల్లీలోని పరిశ్రమలన్నీ పీఎనీజీ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌)నే వాడాలని వారు ఆదేశించారు. దిల్లీలో ఉన్న పరిశ్రమలు పీఎన్‌జీకి మారడం వల్ల జరిగే మార్పులను ఈ కమిషన్‌ సమీక్షించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు, గెయిల్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌ లిమిటెడ్‌(ఐజీఎల్‌) ప్రతినిధులు హాజరయ్యారు.

దిల్లీ మాజీ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టి నేతృత్వంలోని కమిషన్‌ ఈ బాధ్యతను ఐజీఎల్ కంపెనీకి అప్పగించింది. జనవరి 31, 2021 నాటికి దిల్లీలో ఇప్పటికే  గుర్తించిన అన్ని పరిశ్రమలకు పైపుల ద్వారా సహజవాయువు సరఫరా అందేలా చూడాలని ఐజీఎల్‌ను ఆదేశించింది. దిల్లీ కాలుష్య నివారణ కమిటీ (డీపీసీసీ) కూడా ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీ చేయాలని సూచించింది. ఏవైనా పరిశ్రమలు నిషేధిత ఇంధనాలు వాడుతున్నట్లు నిరూపితమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధంగా మార్పుల చేయాల్సిన పరిశ్రమలు సుమారు 1,644 ఉన్నట్లు వారు తెలిపారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు సహజవాయువును వాడుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని కమిషన్‌ ఆదేశించింది. దీనికి కావాల్సిన పైప్‌లైన్లు, మీటరింగ్‌, తదితర మౌలిక సదుపాయాలు ఐజీఎల్‌, గెయిల్‌ సమకూరుస్తాయని కమిషన్‌ వెల్లడించింది. ఐజీఎల్‌, గెయిల్‌, డీపీసీసీ, దిల్లీ ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి అనుకున్న సమయానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కమిషన్‌ సూచించింది. పరిశ్రమలు దిల్లీ కాలుష్యంలో ముఖ్యభూమిక పోషిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 20మంది సభ్యులతో కూడిన ఈ కమిషన్‌ను పర్యావరణ మంత్రిత్వశాఖ నవంబరులో ఏర్పాటు చేసింది. తీవ్ర వాయుకాలుష్యంతో శీతాకాలంలో దిల్లీ ఇబ్బందులు పడుతుండటంతో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి..

’కరోనా కొత్త రకం‘ భారత్‌లో లేదు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని