జనాలకి చుక్కలు చూపించిన ఆ ఐదు : వైరల్‌ వీడియో

తాజా వార్తలు

Published : 18/12/2020 02:13 IST

జనాలకి చుక్కలు చూపించిన ఆ ఐదు : వైరల్‌ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్: మామూలుగా అయితే తలొంచుకుని మందతో పాటు తిరిగే అమాయక ప్రాణులు.. ఉన్నట్టుండి ప్రజలను కంగారుపెట్టాయి. టర్కీలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో 26 లక్షలకు పైగా వ్యూస్‌ను సంపాదించుకుంది. ఇంతకీ ఈ ‘ముఠా’లో ఓ మేక, ఓ గొర్రె, మూడు గొర్రె పిల్లలు ఉన్నాయి.
టర్కీలోని నెవ్‌షేర్‌ మునిసిపాలిటీలో చోటుచేసుకున్న ఈ సంఘటన.. నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. దీనిలో ఆ జంతువులు వ్యక్తులవైపు దూసుకొచ్చి ఢీకొట్టేందుకు ప్రయత్నించడం చూడవచ్చు. వీటి నుంచి తప్పించుకునేందుకు ఓ భవనంలోకి వెళ్తున్న కొందరిని వెంటబడి మరీ తరిమాయి. ఈ విధంగా కొంత సేపు జరిగిన అనంతరం.. తరువాతి ‘కార్యాచరణ’ను గురించి చర్చించేందుకా అన్నట్టుగా అవి అయిదూ ఓ చోట గుమిగూడాయి.
ఈ సరదా సంఘటనను సదరు మునిసిపాలిటీ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది.  ఆ తర్వాత సూటు ధరించిన ఓ వ్యక్తి, గొర్రెపై చేయి వేసి ఉన్న మరో ట్వీట్‌ను షేర్‌ చేసి .. దానికి ‘రాజీ చర్చలు’ అనే వ్యాఖ్యను జతచేయటం నెటిజన్లను మరింత నవ్వించింది. మరి మీరేమంటారో ఈ వీడియో చూసి చెప్పండి!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని