ఆరేళ్ల టీచర్‌.. ఆన్‌లైన్‌లో పాఠాలు

తాజా వార్తలు

Published : 18/08/2020 10:13 IST

ఆరేళ్ల టీచర్‌.. ఆన్‌లైన్‌లో పాఠాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వేళ ఇంట్లో నుంచే విద్యార్థులు పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఆన్‌లైన్‌ క్లాసుల్లో భాగంగా కేరళలో ఒకటో తరగతి చదువుతున్న ఓ టీచర్‌ చెప్పే ఆన్‌లైన్‌ క్లాసులకు మాత్రం ఎనలేని స్పందన వస్తోంది. ఆ బుజ్జి టీచర్‌ పాఠాలను విద్యార్థులు మాత్రమే కాదు.. లక్షలాది నెటిజన్లు ఆసక్తిగా వింటున్నారు. ఈ ఆన్‌లైన్‌ క్లాసుల వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఒకటో తరగతి చదివే ఆ బుజ్జాయి ఎల్‌కేజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు వినిపిస్తూ ఎందరో టీచర్లు, తల్లిదండ్రుల మన్ననలు పొందుతోంది.

మలప్పురం జిల్లాకు చెందిన నుస్రత్‌, తాహీర్‌ దంపతుల కుమార్తె దియా ఫాతిమా. దియా తల్లి ప్రాథమిక పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు. అదే బడిలో దియా ఒకటో తరగతి చదువుతోంది. లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు చెబుతున్న తల్లికి ఒకరోజు ఆరోగ్యం బాగోలేదు. దీంతో దియా తల్లికి సాయపడాలని నిర్ణయించుకుంది. ఎల్‌కేజీ విద్యార్థులకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. అసలైన టీచర్లే ఆశ్చర్యపోయేలా టమాట, చిక్కుడు కాయలతో విద్యార్థులకు లెక్కలు నేర్పింది దియా. ఎంతో అనుభవమున్న టీచర్‌లా చిటికెలో పిల్లలకు లెక్కలు చెప్పిన చిన్నారి బోధనాశైలి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు తెగ నచ్చేసింది. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టమని, పెద్దయ్యాక టీచర్‌ అవ్వాలన్నదే తన కల అంటూ ఇప్పటి నుంచే తన ప్రతిభకు సాన పడుతోంది ఈ చిన్నారి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని