మంచి..చెడుల విచక్షణ అవసరం
ఆరో తరగతి నుంచే ఐఐటీ, నీట్ కోచింగులంటూ... పిల్లలకు ఎటువంటి ఆనందం లేకుండా చేస్తారు తల్లిదండ్రులు. ఇంటర్ దాకా బాగా చదివితే చాలు ఆ తర్వాత నీ ఇష్టం అంటారు. ఇదే గ్రాడ్యుయేషన్ ప్రారంభంలో వారిని విపరీత ధోరణికి మారుస్తుంది. అందుకే ఇంటర్లో 95 శాతం మార్కులు సాధించిన వారు డిగ్రీ ప్రథమ సంవత్సరం బ్యాక్‌లాగ్స్ పెట్టుకుంటారు. అందుకే చిన్నప్పటి నుంచే మన కుటుంబ పరిస్థితులు వివరిస్తూ పెంచాలి. ఏది మంచి, ఏది చెడో విడమరచాలి. బాధ్యత నేర్పాలి. మాకు ఎప్పుడూ స్వేచ్ఛ ఉంది అని పిల్లలు ఫీల్ అయ్యేలా చేయాలి. అప్పుడే ఒక్కసారి పంజరంలోంచి వచ్చిన చిలుకలా ఎలా పడితే అలా ఎగిరిపోకుండా ఉంటారు.
- డా. వీరేందర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్
|