close

ఆదివారం, జనవరి 19, 2020

తాజా వార్తలు

పౌరసత్వ సవరణ బిల్లుపై నిరసన


నెల్లూరులో ముస్లింల శాంతి ర్యాలీ

నెల్లూరు (సంక్షేమం), న్యూస్‌టుడే: పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ రిజిస్ట్రేషన్‌ పౌరసత్వ బిల్లులు పార్లమెంట్‌లో అమోదం పొందడంతో నగరంలో నిరసన నెలకొంది. జిల్లా ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాలు, ముస్లిం మైనార్టీలు నగరంలో శాంతియుతంగా నిరసన ర్యాలీ శుక్రవారం నమాజుల తరువాత నిర్వహించారు. నెల్లూరు కొట్టమిట్టలోని యూసుఫియా మసీదు నుంచి వేలాది మంది ముస్లింలు ర్యాలీగా బయలు దేరి మద్రాసు బస్టాండ్‌, వీఆర్సీ సెంటర్‌ మీదుగా గాంధీ బొమ్మ వరకు చేరుకున్నారు. అక్కడ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి, గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ముస్లిం ఐక్యవేదిక జిల్లా కన్వీనర్‌ సయ్యద్‌ సమి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు భారత రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. మైనార్టీలు జగన్‌మోహన్‌రెడ్డి పాలనపై నమ్మకం, ఎంతో విశ్వాసంతో ఉన్నారని, అయితే మైనార్టీలకు అండగా ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి ముస్లింలకు వ్యతిరేకంగా వచ్చిన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. ఇకనైనా మైనార్టీల మనోభావాలను ముఖ్యమంత్రి అర్ధం చేసుకుని దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న బీజేపీకి దూరంగా ఉండాలన్నారు. నగర మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మాట్లాడుతూ ముస్లింలంతా ఐక్యంగా ఉండి, మతోన్మాద పార్టీలను ఎదుర్కోవాలన్నారు. దీనిపై కోర్టుకు వెళతామన్నారు. బారాషహీద్‌ దర్గా ఈద్గా ఇమామ్‌ సయ్యద్‌ అబూబకర్‌ ఆష్రఫి సాబిరి మాట్లాడుతూ ఇది ప్రజా స్వామ్య దేశమని, ముస్లింలు 9శతాబ్దాలు పరిపాలించారన్నారు. అయినా వారు ఎలాంటి హింసకు పాల్పడలేదని, ఎవరినీ అణచి వేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో మౌలనా ఇలియాజ్‌, మాజీ కార్పొరేటర్‌ ఖలీల్‌, మున్వర్‌, హుసైనీ, ఖాజవలీ, హజీ, అబ్దుల్‌ మస్తాన్‌, జాకీర్‌, అలిండియా ఇమామ్‌ కౌన్సిల్‌ నాయకులు ఖలీలు పలువురు ముస్లిం నాయకులు, మైనార్టీలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.