close

సోమవారం, జనవరి 20, 2020

తాజా వార్తలు

భయం పోగొట్టి.. భరోసానిచ్చేలా!

డయల్‌ 100పై విద్యార్థులకు ప్రత్యక్ష అవగాహన

ఫోన్‌లో మాట్లాడుతున్న విద్యార్థిని

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే : ‘హలో.. నమస్కారం సర్‌! నేను పాఠశాలలో చదివే విద్యార్థిని. మా పాఠశాలలో కొంతమంది ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్నారు. సహచర విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మీరు త్వరగా రండి. ఆకతాయిల ఇబ్బందులను నివారించండి సర్‌’.. అంటూ డయల్‌ 100కు ఓ విద్యార్థిని కాల్‌ చేశారు. స్పందించిన సిబ్బంది వెంటనే సమీపంలోని పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. స్పందించిన సిబ్బంది హుటాహుటిన ఆ పాఠశాలకు తరలివెళ్లారు. తక్కువ సమయంలోనే పోలీసు వాహనం పాఠశాలకు చేరుకోవడం చూసి విద్యార్థులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చప్పట్లతో కేరింతలు కొట్టారు. ఇదంతా కృత్రిమ సంఘటనే అయినప్పటికీ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన సదస్సులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌.ఆర్‌.పాఠశాలలో శనివారం నిర్వహించిన డయల్‌ 100 అవగాహన సదస్సులో పట్టణ సీఐ జాన్‌దివాకర్‌ మాట్లాడారు. ప్రజల్లో ఉన్న భయం పోగొట్టి, పోలీసులపై భరోసా కల్పించేలా ఈ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఏర్పడినా డయల్‌ 100ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకే పోలీసులున్నారని, సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సదస్సులో ఎస్సైలు దేవేందర్‌, దశరథ్‌, ప్రిన్సిపల్‌ సుమలత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


సిబ్బందిని అభినందిస్తున్న సీఐ జాన్‌ దివాకర్‌

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.