close

శనివారం, జనవరి 18, 2020

తాజా వార్తలు

వివాహితపై అత్యాచారయత్నం!

గీసుకొండ, న్యూస్‌టుడే: వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలంలోని ఓ గ్రామంలో వివాహిత మహిళపై పొలెబోయిన రాజ్‌కుమార్‌ అలియాస్‌ చంటి (21) అనే యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఎస్సై రహీమ్‌ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన ఓ గ్రామానికి చెందిన సదరు మహిళ ఈ నెల రెండో తేదీన ఇంట్లో పని చేసుకుంటుండగా రాజ్‌కుమార్‌ ఇంట్లోకి వచ్చి ఆమెపై అత్యాచారయత్నం చేయగా.. ప్రతిఘటించడంతో గొంతు నొక్కాడు. గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యాడు. సానికులు స్పందించి మహిళను వెంటనే చికిత్స కోసం వరంగల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. శనివారం ఇంటికి వచ్చిన బాధితురాలు అత్యాచారయత్న ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటు ఎస్సై రహీమ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.