close

ఆదివారం, జనవరి 19, 2020

తాజా వార్తలు

ఉపాధిలో రూ.17.53 లక్షల అవినీతి

సామాజిక తనిఖీలో నిర్ధారించిన అధికారులు

ఉపాధి సిబ్బందిని విచారిస్తున్న డ్వామా అధికారులు

ఉదయగిరి, న్యూస్‌టుడే : ఉదయగిరి మండలంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో రూ. 17,53,302 అవినీతి జరిగినట్లు డ్వామా అధికారులు వెల్లడించారు. శుక్రవారం స్థానిక మండలపరిషత్తు కార్యాలయ ఆవరణలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సామాజిక తనిఖీ బహిరంగ ప్రజా వేదిక జరిగింది. మండలంలోని 17 పంచాయతీల్లో 2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి వరకు రూ. 11.64 కోట్ల ఉపాధిహామీ నిధులను వెచ్చించి ఉపాధి పనులతోపాటు పంచాయతీరాజ్‌, సెర్ప్‌, గృహనిర్మాణ శాఖ, పశు సంవర్థక శాఖ, సామాజిక, టెరిటోరియల్‌ అటవీశాఖల ద్వారా వివిధ రకాల పనులను చేయించారు. ఖర్చుచేసిన నిధులపై రాష్ట్ర రిసోర్సుపర్సన్‌ మీరావలి ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో జరిగిన పనులను పరిశీలించి పనుల్లో లోపాలను గుర్తించి సామాజిక తనిఖీ బహిరంగ ప్రజా వేదిక దృష్టికి తీసుకొచ్చారు. ప్రిసీిడింగ్‌ అధికారిగా వ్యవహరించిన డ్వామా అదనపు పీడీ విజయేంద్రకుమార్‌ సామాజిక తనిఖీ బృందం గుర్తించిన అవకతలపై ఉపాధి సిబ్బందితోపాటు ఇతర శాఖల సిబ్బందిని విచారించి నిధుల రికవరీకి ప్రతిపాదించారు. ఉపాధి సిబ్బంది నుంచి నిధుల రివకరీ రూ. 8,96,889, సెర్ప్‌ నుంచి 1,06,730, పశుసంవర్థక శాఖ నుంచి రూ. 17,361, గృహనిర్మాణశాఖ నుంచి రూ.1650, సామాజిక అటవీశాఖ నుంచి రూ.67,165, టెరిటోరియల్‌ అటవీ విభాగం నుంచి రూ. 5,98,028, పంచాయతీరాజ్‌ నుంచి రూ. 14,449, జరిమానాల కింద రూ. 51,00 రికవరీకి ఆదేశించారు. ఉపాధి పనుల్లో జరిగిన అవకతవకలపై జిల్లా కలెక్టరుకు నివేదించి బాధ్యుల నుంచి నిర్ధారించిన మొత్తాన్ని రికవరీ చేయిస్తామని అధికారులు వెల్లడించారు. పంచాయతీరాజ్‌, అటవీశాఖల ద్వారా జరిగిన పనులకు సంబంధించి దస్త్రాలు ఇవ్వలేదన్నారు. ప్రజా వేదికకు హాజరైన ఐఎంపీ ఎస్‌ఆర్‌పీ దుర్గమ్మ అవకతవకలపై గట్టిగా అధికారులతో వాదించి రికవరీలు పెట్టేలా చేశారు.

 

అప్పసముద్రం పంచాయతీలో ఎక్కువ

అప్పసముద్రం పంచాయతీలో అధిక మొత్తంలో పనుల్లో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. మస్టర్ల నమోదులో భారీగా అవినీతి జరిగినట్లు తేల్చారు. ఆ పంచాయతీలో ఉపాధి సిబ్బందికి రూ. 5,05,969 నిధుల రికవరీ నమోదు చేశారు. అలాగే ఆర్లపడియ పంచాయతీ రూ. 4,449, క్రిష్ణంపల్లి 9,650, తిరుమలాపురం రూ. 1383, దాసరిపల్లి రూ. 16,024, శకునాపల్లి రూ. 3,537, జి.చెరువుపల్లి 5,297, కొండాయపాళెం రూ. 2,74,913, గండిపాళెం రూ. 1592, పుల్లాయపల్లి 4,140, జి.అయ్యవారిపల్లి రూ. 4,261, బండగానిపల్లి రూ. 5,026, జి.చెర్లోపల్లి రూ. 4,525, గన్నేపల్లి రూ. 4,150, నేలటూరు రూ. 19,393, ఉదయగిరి పంచాయతీలో రూ. 32,580 వంతున వసూలు చేయాలని ఆదేశించారు. తనిఖీ కార్యక్రమంలో ఉపాధిహామీ పథకం జిల్లా నాణ్యతా నియంత్రణాధికారి ప్రకాష్‌రెడ్డి, విజిలెన్స్‌ అధికారి వెంకటేశ్వరరావు, ఏపీడీ విజయకుమార్‌, ఎంపీడీవో వీరాస్వామి, ఫడ్స్‌ డైరెక్టరు రమణయ్య, ఏపీవోలు మధుసూదనరావు, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.