close

ఆదివారం, జనవరి 19, 2020

తాజా వార్తలు

అంతర్జాతీయ పోటీల్లో బాడీబిల్డర్‌ రాజ్‌సేన్‌కు పతకాలు

బాడీబిల్డర్‌ రాజ్‌సేన్‌ను అభినందిస్తున్న

మంత్రి అనిల్‌, ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే : నెల్లూరు నగరానికి చెందిన బాడీబిల్డర్‌ పెనుబల్లి రాజ్‌సేన్‌ అసమాన ప్రతిభను సాధించారు. అమెరికాలోని లాస్‌ఏంజల్స్‌ నగరంలో ఐఎన్‌బీఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన నేచురల్‌ యూనివర్స్‌లో భారతదేశం నుంచి పాల్గొని బంగారు పతకం, కాంస్య పతకం (మూడో స్థానం), లాస్‌వేగస్‌లో జరిగిన నేచురల్‌ ఒలింపియా నేచురల్‌ బాడీ బిల్డింగ్‌ పోటీలలో స్పోర్ట్స్‌ మోడల్‌లో సిల్వర్‌ పతకం (ద్వితీయ స్థానం) సాధించారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం నగరంలోని మంత్రి అనిల్‌ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాజ్‌సేన్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన సాధించిన పతకాలు, సర్టిఫికేట్లను ప్రదర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నగరానికి చెందిన బాడీబిల్డర్‌ రాజ్‌సేన్‌ సింగ్‌ అమెరికాలో జరిగిన పోటీల్లో భారతదేశం తరఫున పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు రూప్‌కుమార్‌యాదవ్‌, నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.