మంగళవారం, డిసెంబర్ 10, 2019
పరకాల: గీసుగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని 243 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను భూ సమస్యల నుంచి విముక్తి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సాదాబైనామా ప్రవేశపెట్టారన్నారు. నియోజకవర్గంలో దాదాపుగా భూసమస్యలు పరిష్కరించారని తెలిపారు. గ్రామాలలో రైతులకు ఏమైనా భూ సమస్యలు ఉంటే రైతు సమన్వయ సమితి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్య రైతులకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదే అన్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు