close

ఆదివారం, డిసెంబర్ 15, 2019

తాజా వార్తలు

సమస్యల పరిష్కారంలో పారదర్శకత అవసరం

జేసీ మహేందర్‌రెడ్డి


వినతులు స్వీకరిస్తున్న జేసీ మహేందర్‌రెడ్డి

రూరల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు పారదర్శకత పాటించాలని జేసీ మహేందర్‌రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భూసమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని, తర్వాత స్థానంలో సదరం ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు వస్తున్నాయని ఆయన వివరించారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి వసతులు కల్పించాలని ఆదేశించారు. డీఆర్‌వో హరిసింగ్‌, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే శుభ్రపరచండి..

రూరల్‌ కలెక్టరేట్‌: ధాన్యం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన తర్వాత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులే శుభ్రం చేసి రైస్‌ మిల్లులకు తరలించాలని జేసీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం డీఆర్‌డీవో కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై రైస్‌ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తే వెంటనే జిల్లా అధికారులకు తెలిపాలని సూచించారు. వాట్సప్‌గ్రూప్‌ ఏర్పాటు చేశామని, ఆ గ్రూపులో పోస్టు చేయాలని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారులు, రైస్‌ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.