close

ఆదివారం, డిసెంబర్ 08, 2019

తాజా వార్తలు

ఘనంగా యువజనోత్సవాలు

వీణ వాయిస్తున్న యువతి..

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో శనివారం యువజన సర్వీసు శాఖ, సెట్నల్‌ సంయుక్త ఆధ్వర్యంలో యువజనోత్సవాల్లో భాగంగా నెల్లూరు డివిజన్‌ స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొని వారి కళానైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానుద్దేశించి ముఖ్యకార్యనిర్వహణాధికారిణి ఎం.సుస్మిత మాట్లాడుతూ యువత కేవలం చదువులకే పరిమితం కాకుండా సాంస్కృతిక, క్రీడా నైపుణ్యాలు కలిగి ఉండాలని పేర్కొన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ధ్రువపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నియోజక వర్గ ఇన్‌ఛార్జి గిరిధర్‌ రెడ్డి, డీకే ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మస్తానయ్య, సెట్నల్‌ మేనేజర్‌ శ్రీమన్నారాయణ, గయాజ్‌ అహ్మద్‌, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

నృత్యం చేస్తున్న విద్యార్థినిలు

​​​​​​​
ఉత్సవాలకు హాజరైనవారు

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.