ఆదివారం, డిసెంబర్ 15, 2019
చేనిగుంట(తడ), న్యూస్‌టుడే: మండలంలోని చేనిగుంట ఎస్టీ కాలనీ సమీపంలో శనివారం సాయంత్రం ట్యాంకరు లారీ నుంచి గ్యాస్ విడుదలవడంతో స్థానికులు ఆందోళన చెందారు. తీరా అది ఆక్సిజన్ అని తేలాక ఊపిరి పీల్చుకున్నారు. ఆసుపత్రుల్లో రోగులకు వినియోగించి ఆక్సిజన్‌ను కోవూరులో అన్లోడ్ చేసి ట్యాంకరు చెన్నై వెళుతోంది. మార్గమధ్యంలో చేనిగుంట వద్దకొచ్చేసరికి డీజిల్ ఖాళీ అయింది. దీంతోపాటు రీడింగు మీటరులో పీడనం అధికంగా చూపిస్తుండడంతో మిగిలిన కొద్దిపాటి ఆక్సిజన్‌ను లారీ సిబ్బంది వదిలారు. తెల్లటి వాయువు రూపంలో వెలువడడంతో ట్యాంకరు దగ్గరకు వెళ్లేందుకు ప్రజలు భయపడ్డారు. సిబ్బంది అసలు విషయం చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు