దొంగ అరెస్టురూ.2 లక్షల ఆభరణాలు స్వాధీనం

వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బంది.
చిత్రంలో దొంగ (ముసుగులో ఉన్న వ్యక్తి)
నాయుడుపేట పట్టణం, న్యూస్టుడే: పట్టణంలోన ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికురాలి బంగారు ఆభరణాలు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సోమవారం నాయుడుపేటలో సీఐ వేణుగోపాలరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 17న ఆర్టీసీ బస్టాండులో కోట వెళ్లే బస్సు కోసం రాజగోపాలపురం వాసి చల్లా శ్రీదేవి సంచితో వేచి చూస్తోంది. ఈ సంచిలో బంగారు నగలు దాచిన పర్సు ఉంది. బోగోలు మండలంలోని కప్పరాళ్లతిప్ప గ్రామానికి చెందిన నెలబాయి ఫ్ల్రాంకిన్ ఆమె చేతిలోని కర్రల సంచిలో ఉన్న పర్సు చోరీ చేశాడు. అందులో పది సవర్ల బంగారు అభరణాలు ఉన్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఎస్సై వెంకటేశ్వరరావు, సిబ్బంది బస్టాండులో గాలిస్తుండగా చోరీ చేసిన వ్యక్తి తారసపడడంతో అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. రూ.2 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిని బాధితురాలికి అప్పగిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వరరావు, హెడ్కానిస్టేబుళ్లు, ఐడీ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.