close

మంగళవారం, నవంబర్ 12, 2019

తాజా వార్తలు

నేడు నిర్మల్‌కు భగీరథ చీఫ్‌ ఇంజినీరు రాక

పనులపై మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేతో సమావేశం

ఆదిలాబాద్‌ పట్టణం: మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై సమీక్షించేందుకు ఆ విభాగం చీఫ్‌ ఇంజినీరు కృపాకర్‌రెడ్డి సోమవారం నిర్మల్‌ పట్టణానికి రానున్నారు. నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో పనుల తీరును ఆయన సమీక్షిస్తారు. ఈ సమావేశానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఎంపీ, రెండు జిల్లాల ఎమ్మెల్యేందరిని ఆహ్వానించారు. నిర్మల్‌ జిల్లాలో ఇంతకుముందు భగీరథ పనులు చేపట్టకుండానే నిధులు మింగేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ విషయంపైనా ఆయన విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. మంగళవారం మంచిర్యాల, కుమురంభీం జిల్లాలకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి అధికారులతో పాటు రెండు జిల్లాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.