close

గురువారం, అక్టోబర్ 17, 2019

తాజా వార్తలు

బాలుడిని మింగేసిన డ్రెయిన్‌

తమిరిశ (నందివాడ), న్యూస్‌టుడే : అదృశ్యమయ్యాడని భావించిన బాలుడు మూడు రోజుల తర్వాత అనమనపూడి వద్ద ఆదివారం శవమై తేలాడు. పోలీసులు, సేకరించిన వివరాల ప్రకారం.. తమిరిశ శివారు నక్కవారిపాలెంకు చెందిన నక్కా శ్రవణ్‌కుమార్‌, రంగమ్మల కుమారుడు నక్కా సంతోష్‌కుమార్‌(8) తమ గ్రామానికి వెళ్లేందుకు చంద్రయ్య డ్రెయిన్‌పై ఉన్న వంతెన దాటుతూ శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో కాలువలో జారిగల్లంతయ్యాడు. ఆ సమయంలో బాలుడి తల్లిదండ్రులు గుడివాడకు వెళ్లారు. వారు రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి తిరిగివచ్చే సమయానికి బాలుడు కన్పించలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించి ఎక్కడా లేడని నిర్ధరణ చేసుకొని వంతెన దాటుతూ కాలువలో జారిపడినట్లు అనుమానపడ్డారు. ఆ రాత్రే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కాలువలో గాలించినా ఆచూకీ లభించలేదు. తహశీల్దార్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌, ఎస్సై అనీల్‌ తమ సిబ్బందితో పోలుకొండ వద్ద కొత్త వంతెనకు వలలు కట్టించి పడవలపై ఈతగాళ్లు, ఫైర్‌ సిబ్బందితో గాలించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో వంతెనకు వలలు కట్టించి రెగ్యులేటర్‌ షట్టర్‌ గేట్లను పైకిలేపి నీటిని కిందికి విడిచిపెట్టడం, అప్పటికే 48 గంటలు గడవడంతో ఆదివారం ఉదయం అనమనపూడి వంతెనకు కొద్దిదూరంలో ముళ్లకంపకు పట్టేసి పైకితేలిన బాలుడి మృతదేహం సిబ్బందికి లభించింది. రెవెన్యూ, పోలీసు అధికారులు మృతదేహాన్ని కాలువ నుంచి బయటికి తీయించి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉబ్బిపోయింది.బాలుడు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. వంతెన దుస్థితితో ఇప్పటికే ఇద్దరు మృతిచెందారని, ఇంకా ఎంత మందిని పొట్టనపెట్టుకుంటే బాగుచేస్తారని గ్రామస్థులు అధికారులను నిలదీశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

6 లక్షల మంది విద్యార్థులకు నేత్ర పరీక్షలు

అంధత్వ నివారణే లక్ష్యంగా జిల్లాలో చేపట్టిన వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కింద 4,500 పాఠశాలలోని ఆరు లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ అన్నారు. పటమటలోని ఎన్‌ఎస్‌ఎం పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న నేత్ర పరీక్షల స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని ఆయన బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,500 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు మొదటి దశ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాడ అర్బన్‌లో 550 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని వీటిలో కూడా బాలబాలికలకు నేత్ర పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. నవంబరు 1 నుంచి డిసెంబరు వరకు రెండో దశ నేత్ర

రాష్ట్రంలో ఒక్కరూ సంతోషంగా లేరు

వైకాపా పాలనలో రాష్ట్రంలో ఒక్కరు కూడా సంతోషంగా లేరని రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వ్యాఖ్యానించారు. ఎవరిని కదలించినా వారి ఇబ్బందులను ఏకరువు పెడుతున్నారని తెలిపారు. నందిగామ శివారు అనాసాగరం వద్ద బుధవారం (రెండో రోజు) గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు. అనాసాగరం, నందిగామ, కంచికచర్లలో కంచలమ్మ చెరువుకట్ట, పెద్దబజారు, నెహ్రూబొమ్మ సెంటరు, మార్కెట్‌ యార్డు మీదుగా యాత్ర ఉత్సాహంగా సాగింది. అనాసాగరం, కంచికచర్లలో  భాజపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పలువురు భాజపాలో చేరారు. సుజనాచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా నాయకులు వ్యక్తిగత దూషణలతో కా

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.