close

సోమవారం, అక్టోబర్ 21, 2019

తాజా వార్తలు

మంత్రి అల్లోల కోడలికి రైతునేస్తం పురస్కారం

పురస్కారం అందుకుంటున్న దివ్యారెడ్డి

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు పేరిట ఏటా ఇచ్చే రైతునేస్తం పురస్కారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కోడలు అల్లోల దివ్యారెడ్డికి దక్కింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆమెకు పురస్కారం అందజేశారు. క్లిమామ్‌ గోశాల ఏర్పాటుచేసి దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ఈ పురస్కారానికి ఎంపికచేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. మున్ముందు కార్యకలాపాలను మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు. ఇందులో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.