close

శనివారం, జులై 11, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తూకంలో మోసం

కొత్తపల్లిలో రైతుల ఆందోళన

వివరాలు తెలుసుకుంటున్న జేసీ స్వర్ణలత

కొత్తపల్లి(కాటారం) ,న్యూస్‌టుడే: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసిన రైతులను నిలువునా దోచుకుంటున్నారు.తూకంలో మోసం చేస్తూ ఒక్కో (40 కిలోలు) సంచికి 3 నుంచి 5 కిలోల వరకు ధాన్యాన్ని అదనంగా కాజేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సాధారణ కాంటా ఉపయోగిస్తూ అందినకాడికి దోపిడీ చేస్తున్న ఘటన గురువారం కాటారం మండలం కొత్తపల్లిలో వెలుగు చూసింది. ఈ వ్యవహారం ఎన్నాళ్ల నుంచి జరుగుతుందో తెలియక రైతులు కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం ధాన్యాన్ని శుద్ధి చేసినప్పటికీ తూకంలో మోసాలకు పాల్పడుతూ తమ పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు,మిల్లర్లు కుమ్కక్కై ఒక్కో లారీకి 8 నుంచి 10 క్వింటాళ్ల కోత విధిస్తూ తమను నట్టేట ముంచుతున్నారని ఆందోళన చెందారు.ఈ రకంగా తాము పండించిన దాన్యానికి మద్దతు ధర దక్కడం కాదుకదా అసలుకే నష్టపోవాల్సి వస్తుందని రైతులు తమ ఆవేదన వెల్లగక్కారు.విషయం తెలుసుకున్న ఎంపీపీ సమ్మయ్య, పీఏసీఎస్‌ అధ్యక్షుడు చల్ల నారాయణ రెడ్డి, జిల్లా సహకార సంఘం అధికారి రామ్మోహన్‌లు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. కల్లంలోని బస్తాలను రైతుల సమక్షంలో తిరిగి తూకం వేయించారు.కేంద్ర బాధ్యుడు, హమాలీలను ప్రశ్నించగా పొరపాటు జరిగినట్లుగా అంగీకరించారు. ఇప్పటి వరకు మిల్లులకు తరలించిన ధాన్యానికి సంబంధించిన వేబ్రిడ్జి కాంటా రశీదులు ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టారు. కనీసం తాము విక్రయించిన ధాన్యానికి ఎలాంటి రశీదులు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. మిల్లులకు తరలించిన ధాన్యానికి సంబంధించి వేబ్రిజ్డి కాంటా రశీదులు రైతులకు అందజేయడంతో పాటు తూకంలో ఏమైనా వ్యత్యాసం వస్తే రైతులకు డబ్బులు చెల్లించాలని సిబ్బందికి సూచించారు. విషయం తెలుసుకున్న జిల్లా సంయుక్త పాలనాధికారి స్వర్ణలత, తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి శ్రీలతలు కల్లంవద్దకు చేరుకొని అక్కడ జరుగుతున్న మోసాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం బాధ్యుడితో పాటు హమాలీలపై వెంటనే కేసు నమోదు చేసి వారిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.

నిబంధనల ప్రకారం

కొనుగోలు కేంద్రాల్లో ఎలక్ట్రానిక్‌ కాంటాలు మాత్రమే ఉపయోగించాలి. కాని ఇక్కడి సిబ్బంది మాత్రం నిబంధనలు తుంగలో తొక్కి అందుకు విరుద్దంగా సాధారణ కాంటాలను ఉపయోగిస్తూ రైతులను మోసం చేస్తున్నారు.దీంతో క్వింటాలు ధాన్యానికి సుమారు 13 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. మూడు రోజుల క్రితం మండలంలోని విలాసాగర్‌లో ఓ రైతు 960 బస్తాలు విక్రయించగా అనుమానం వచ్చి తిరిగి కాంటా వేస్తే బస్తాకు 3 కిలోలు అదనంగా చూపించింది.

వెలుగు చూసిందిలా..

కొత్తపల్లికి చెందిన తోడె బాల్‌రెడ్డి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో బుధవారం విక్రయించాడు. 40.700 కిలోల చొప్పున 225 బస్తాలు తూకం వేశారు. రైతుకు అనుమానం వచ్చి తిరిగి కాంటా వేయగా ఒక్కో బస్తాకు 3 నుంచి 6 కిలోల ధాన్యం అదనంగా ఉన్నట్లు గుర్తించారు. కంగు తిన్న రైతు తాను నష్టపోయానని తెలుసుకొని ఇతర రైతులకు తెలపడంతో మిగతా రైతులు అంతా జతకట్టారు. కల్లంలోని మరికొన్ని బస్తాలను తూకం వేయించగా అదనంగా ధాన్యం ఉన్నట్లు తేలింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీసినా స్పందన రాలేదు. దీంతో విషయాన్ని ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులకు సమాచారం అందించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.