close

శనివారం, జులై 11, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రాధాన్యమున్న పంటలనే సాగు చేయాలి
రైతు అవగాహన సదస్సులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గండ్ర

చిట్యాల, న్యూస్‌టుడే: రైతులు నియంత్రిత పద్ధతిని పాటిస్తూ ప్రాధాన్యం కలిగిన పంటలనే సాగు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. గురువారం ఆయన చిట్యాల మండలంలో పర్యటించారు. చిట్యాల, చల్లగరిగె, జూకల్‌ గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలలో అదనపుగదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వ్యవసాయశాఖ అధ్వర్యంలో చల్లగరిగె, చిట్యాలలో జరిగిన 2020 వానాకాలం వ్యవసాయ పంటలపై అవగాహన సదస్సులలో ఆయన పాల్గొని నియంత్రిత పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ దావు వినోద, జడ్పీటీసీ సభ్యుడు గొర్రె సాగర్‌, ఎంపీడీవో రవీంద్రనాథ్‌, ఏవో రఘుపతి, ఎంఈవో రఘుపతి, వైస్‌ ఎంపీపీ రాంబాబు, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ క్రాంతికుమార్‌రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.

పత్తి కొనుగోళ్లు పరిశీలన: చిట్యాల కాకతీయ కాటన్‌ ఇండస్ట్రీస్‌ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలును పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో చరవాణిలో మాట్లాడి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.