close

శనివారం, జులై 11, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేర వార్తలు
సచిన్‌ (పాత చిత్రం)

చెరువులో పడి యువకుడి మృతి: నెక్కొండ, న్యూస్‌టుడే: నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన కంచర్ల సచిన్‌ (21) గ్రామంలోని గిద్దెకుంట చెరువులోకి బుధవారం సాయంత్రం ఈతకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగాడు. గ్రామస్థులు బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.


మహిళ ఆత్మహత్య: చెన్నారావుపేట: మండలంలోని పాపయ్యపేటకు చెందిన పత్తి పుష్ప(40) కడుపునొప్పి భరించలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రవి గురువారం తెలిపారు. మృతురాలి భర్త జంపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.


రోడ్డు ప్రమాదంలో గాయాలు: ఏటూరునాగారం: రొయ్యూరు గ్రామ సమీపంలోని పాలమాకువాగు వద్ద గురువారం ఆటో, ద్విచక్రవాహనం ఢీకొని నలుగురికి గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్‌ సమ్మయ్య, ఆటోలో ప్రయాణిస్తున్న ఎల్లయ్య, రామ్మూర్తి, ద్విచక్రవాహనదారుడు ప్రవీణ్‌కు గాయాలయ్యాయి.


పరకాల: వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెచ్చెల రాము ద్విచక్ర వాహనంపై హన్మకొండ రోడ్డు వైపు వెళుతుండగా పరకాలలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం సమీపంలో ఆగి ఉన్న ఆటో ట్రాలీని గురువారం ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయాలయ్యాయి. బ్లూ కోల్ట్‌ పోలీసులు సివిల్‌ ఆసుపత్రికి తరలించారు.


వడదెబ్బతో ఇద్దరి మృతి: మహబూబాబాద్‌ రూరల్‌: మండలంలోని రంగసాయిపేటలో గురువారం సురకంటి కర్ణాకర్‌(28) ఉదయం ఉపాధిహామీ పనికి వెళ్లాడు. వడదెబ్బ తగిలి ఇంటికి రాగానే వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు మహబూబాబాద్‌కు తరలించే క్రమంలో మృతిచెందాడు.


గీసుకొండ: మండలంలోని బొడ్డుచింతలపల్లిలో హరితహారంలో భాగంగా బుధవారం మొక్కలకు నీరు పోస్తుండగా ఇమ్మడి రాధ (40) అనే వాచర్‌ వదడెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు గురువారం తెలిపారు.


ట్రాక్టర్‌, ద్విచక్రవాహనం ఢీ: నల్లబెల్లి: మండలంలోని రాంపూర్‌ శివారు దామెర చెరువు వద్ద గురువారం ట్రాక్టర్‌, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. బైక్‌ నడుపుతున్న నాగరాజుపల్లికి చెందిన రాజేందర్‌ తలకు గాయం కాగా, హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.


పలువురిపై కేసు నమోదు: భూపాలపల్లి: మండలంలోని రాంపూర్‌ గ్రామంలో కొండగొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న వి.సమ్మయ్య, కె.మురళి, పి.లక్ష్మణ్‌పై గురువారం కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి అటవీ రేంజి అధికారి రేణుక తెలిపారు.


తొర్రూరు టౌన్‌: వ్యవసాయ బావిలో బుధవారం ఓడలు వేస్తుండగా మట్టి కూలిపోయి కూలీ మృతిచెందిన ఘటనపై గురువారం మృతురాలి భర్త కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీహెచ్‌.నగేష్‌ తెలిపారు.


నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత: మహబూబాబాద్‌ రూరల్‌: చిన్నగూడూరు నుంచి మహబూబాబాద్‌కు బుధవారం రాత్రి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు గురువారం తెలిపారు.


వివాహిత ఆత్మహత్య: శివనగర్‌, రంగశాయిపేట: వరంగల్‌ 18వ డివిజన్‌ పెరుకవాడలో ఎలిమగండ్ల స్రవంతి అనే వివాహిత గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు మిల్స్‌కాలనీ సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు. బుధవారం రాత్రి భర్త సందీప్‌తో గొడవపడిన ఆమె క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుందన్నారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారన్నారు. మృతురాలి కుటుంబాన్ని కార్పొరేటర్‌ ఉషశ్రీ పరామర్శించారు.


అనుమానాస్పదంగా మహిళ మృతి: ములుగు: ములుగు పట్టణానికి చెందిన రాంపెల్లి ఉషారాణి(25) గురువారం మల్లంపల్లి శివారు మంచినీళ్లపల్లిలోని చెరువులోపడి మృతిచెందింది. నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లికి చెందిన రాంపెల్లి సురేష్‌-ఉషారాణి దంపతులు కొంతకాలంగా ములుగులో నివాసం ఉంటున్నారు. సురేష్‌ గురువారం ఇంటికి వచ్చే సరికి తాళం వేసి ఉంది. అదే సమయంలో మల్లంపల్లి శివారు మంచినీళ్ల పల్లి చెరువులో గుర్తు తెలియని మహిళ శవం బయట పడిందని తెలియడంతో అక్కడకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న సీఐ దేవేందర్‌రెడ్డి, ఎస్సై రాజు మృతదేహాన్ని చెరువులోంచి తీయించి ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి భర్త ఆమెను గుర్తించారు. సంబంధం లేని ప్రాంతానికి వెళ్లి చెరువులో శవమై తేలడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


ధాన్యం చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్‌

సమ్మయ్య అరెస్ట్‌ను చూపుతున్న ఎస్‌ఐ జీడి సూర్యప్రకాశ్‌

కమలాపూర్‌, న్యూస్‌టుడే: మండలంలో కన్నూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తిరుపతి రవికి చెందిన 15 బస్తాల వడ్లను చోరీ చేసిన అదే గ్రామానికి చెందిన ఒర్సు సమ్మయ్యను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈనెల 19న రాత్రి వడ్లు చోరీ కాగా రైతు తిరుపతి రవి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌ కేసు దర్యాప్తులో భాగంగా ఒర్సు సమ్మయ్యను పట్టుకొని విచారించారు. తాగుడుకు బానిసై, కూలీ పనులు లేక దొంగతనం చేసి 15 బస్తాల ధాన్యాన్ని (10 క్వింటాళ్లను) జమ్మికుంట మార్కెట్లో రహస్యంగా విక్రయించినట్లు ఒప్పుకున్నాడని ఇన్‌స్పెక్టర్‌ డి.రవిరాజు చెప్పారు. ధాన్యాన్ని అమ్మగా వచ్చిన రూ.15,000లను స్వాధీనపర్చుకొని, సమ్మయ్యను గురువారం అరెస్ట్‌ చేసి హుజూరాబాద్‌ కోర్టులో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.