close

ఆదివారం, నవంబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రమాదాల బరి.. జాతీయ రహదారి

రహదారి మధ్యలో ఉంచిన బోర్డులు

కొడవలూరు మండల పరిధిలో జరిగిన మూడు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. పలు ఘటనల్లో పది మంది వరకు గాయపడ్డారు. కోవూరు మండల పరిధిలో మూడు ప్రమాదాలు జరగ్గా ఆరుగురు గాయపడ్డారు. ఇవేమిటీ ప్రమాదాలు చెబుతున్నారనుకుంటున్నారు కదూ! అదేనండి నగర శివారులోని కోవూరు నియోజకవర్గం పరిధిలో ఈనెలలో ఇప్పటివరకు జరిగిన ప్రమాద ఘటనలివి. దీన్నిబట్టి జాతీయ రహదారిపై ప్రయాణం ఎంత భయానకంగా ఉందో తెలుసుకోవచ్ఛు రహదారి నిర్వహణ సరిగా లేకపోవడంతో గతుకులు, గుంతలమయంగా మారింది. పైగా మరమ్మతుల పేరుతో రహదారి మధ్యలో హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. రాత్రిళ్లు ఇవి కనిపించక వాహనచోదకులు ఢీకొని పడిపోతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

కోవూరు, న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. కావలి నుంచి తడ వరకు ఉన్న ఈ మార్గంలో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని నిర్వహణ సక్రమంగా చేయడం లేదు. వర్షాలకు గుంతలు పడ్డాయి. వీటి కారణంగా వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నగర సమీపంలోని కోవూరు మండల పరిధిలో పల్లెదారిని తలపిస్తోంది. కోవూరు- నార్తురాజుపాళెం మధ్య ఆరు నెలల క్రితం మరమ్మతులు చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. నడిరోడ్డులోనే ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేసి ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. వాహనదారుల నుంచి నిత్యం టోల్‌ ఫీజు వసూలు చేసే నిర్వాహకులు రహదారి మరమ్మతులను పట్టించుకోవడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మధ్యలో డివైడర్ల మధ్య మొక్కలు కూడా పెంచకపోవడంతో డివైడర్లు నిర్మానుష్యంగా మారాయి. దీంతో రాత్రిళ్లు ఎదురెదురుగా వచ్చే వాహనాల లైటింగ్‌ కళ్లలో పడుతుందని వాహనదారులు పేర్కొంటున్నారు.

హెచ్చరిక బోర్డులతో ప్రమాదాలు

కోవూరు - కొడవలూరు మండలాల మధ్య రోడ్డు మధ్యలో ఏర్పాటుచేసిన హెచ్చరిక బోర్డులను ద్విచక్రవాహనదారులు, కార్లు, ఆటోలు, లారీలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు నాలుగైదు ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. స్వల్ప ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని చెబుతున్నారు.

రాత్రిళ్లు ప్రయాణం భయానకం

రాత్రిళ్లు కొడవలూరు వైపు నుంచి కోవూరు వైపు జాతీయ రహదారి మీదుగా వెళ్లేందుకు వణికిపోతున్నాం. రహదారి మధ్యలోనే ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టడడంతో వాహనాలను నియంత్రించలేకపోతున్నాం. వీటిని ఢీకొని వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాం.మహేష్‌రెడ్డి, కోవూరు

డివైడర్లలో మొక్కలేవీ?

జాతీయ రహదారి మధ్యలో డివైడర్లపై మొక్కలు పెంచాలి. ఇవి లేకపోవడంతో రాత్రిళ్లు వాహనాల లైటింగ్‌ కళ్లలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో మొక్కలు నాటితే బాగా పెరుగుతాయి. అమరేంద్రరెడ్డి, కొడవలూరు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.