close

గురువారం, అక్టోబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండో రోజు జిల్లాలో కేంద్ర బృందాల పర్యటన

అడుగడుగునా అన్నదాతల ఆవేదన

చేజర్ల: కేంద్ర బృందానికి సమస్యలు విన్నవిస్తున్న రైతులు

వెంకటాచలం, న్యూస్‌టుడే: ధాన్యం పరిశీలనలో భాగంగా రెండో రోజైన బుధవారం కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించాయి. ఆజాద్‌ ఖాన్‌, సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌ రోజ్‌మాండ్‌ ఆధ్వర్యాన ఓ బృందం, యతేంద్ర జైన్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి బాలకృష్ణరావు ఆధ్వర్యాన మరో బృందం వివిధ గ్రామాల్లో తిరిగాయి. రోడ్లపై ఆరబెట్టిన తడిచిన ధాన్యపు రాశులు వారికి అడుగడుగునా దర్శనమిచ్చాయి. ఆయా బృందాలకు రైతులు తమ సమస్యలు ఏకరవు పెట్టారు. వర్షాల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా నష్టపోయామని, పరిహారం ఇప్పించాలని వేడుకున్నారు. వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే.. నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. నాలుగు నెలల కిందట ఎన్‌ఎల్‌ఆర్‌ 3354 రకం ధాన్యాన్ని పుట్టి రూ.14,700 కొనుగోలు చేశారని, ప్రస్తుతం రూ.8 వేలకు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కోరారు.

రెండో రోజు పర్యటన ఇలా..

చేజర్ల, కలువాయిలోని వ్యవసాయ సహకార సంఘాలకు వెళ్లి అక్కడి ధాన్యం నమూనాలు పరిశీలించారు. ఆత్మకూరు మండలం చెర్లో ఎడవల్లి గ్రామంలో రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని చూశారు.● విడవలూరు మండలం పార్లపల్లిలో పర్యటించి రోడ్లపై ఆరబోసిన ధాన్యం పరిశీలించి, నమూనాలు తీసుకున్నారు. ● బాలయపల్లి మండలం నిడిగల్లు, సిద్దాగుంట, కడగుంట; డక్కిలి మండలం నాగవోలు, పెదయాససముద్రం వెళ్లి అక్కడి పంటలు, రంగు మారిన ధాన్యం చూశారు. ● నాయుడుపేట మండలం పుదూరులోని రైస్‌ మిల్లుకు, తడమండలం వేనాడు గ్రామలకు వెళ్లి అక్కడ ధాన్యం చూశారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.