close

గురువారం, అక్టోబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విస్తృతంగా వ్యవసాయ పరిశోధనలు

ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి


వరి ఓదెలను పరిశీలిస్తున్న వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, చీడపీడల్లేని వంగడాలు సృష్టించి రైతులకు మేలు చేకూర్చేందుకు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. నగరంలోని వ్యవసాయ పరిశోధనా స్థానాన్ని బుధవారం సందర్శించారు. పరిశోధనా ప్రగతి, సాంకేతిక పర్యవేక్షణ, ల్యాబ్‌, క్షేత్రస్థాయి అంశాలను పరిశీలించారు. నెల్లూరు ఏఆర్‌ఎస్‌లో రూపొందించిన ఎన్‌ఎల్‌ఆర్‌ 34449, ఎన్‌ఎల్‌ఆర్‌ 3354 రకాల వరి విత్తనాలు దేశవ్యాప్తంగా సాగవుతున్నట్లు చెప్పారు. దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉండగా- ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం పరిశోధనల్లో మంచి గుర్తింపు పొందిందన్నారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నిరంతర సలహాలు, సూచనలు అందించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం బీవీనగర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలించారు. సంయుక్త వ్యవసాయ సంచాలకులు ఎల్‌.ప్రశాంతి, నెల్లూరు, పొదలకూరు వ్యవసాయ పరిశోధనా స్థానాల అధిపతులు పి.రాజశేఖర్‌, వెంకటేశ్వర్లు, సమన్వయకర్త శివజ్యోతి, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.