close

గురువారం, అక్టోబర్ 29, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరు వ్యాపారులకు రుణాలు

నెల్లూరు(సంక్షేమం): ‘జగనన్న తోడు’ పథకం కింద చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేయించాలని ఆసరా జేసీ సూర్యప్రకాశరావు అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై బుధవారం సిబ్బందితో సమీక్షించారు. ‘జగనన్న తోడు’కు పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి 34,700 దరఖాస్తులు రాగా.. 9,750 వేలను బ్యాంకులకు పంపినట్లు చెప్పారు. 47 మందికి మాత్రమే రుణాలు మంజూరయ్యాయని, మిగిలిన వారు వారం రోజుల్లోపు రుణాలు పొందేలా చూడాలన్నారు. డీఆర్‌డీఏ పీడీ నాగలక్ష్మి, మెప్మా పీడీ రవీంద్ర పాల్గొన్నారు.

రైతు ఉత్పత్తి సంఘాల బలోపేతం

రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేయాలని డీఆర్‌డీఏ పీడీ నాగలక్ష్మి అన్నారు. స్థానిక డీఆర్‌డీఏ కార్యాలయంలో సిబ్బందితో బుధవారం సమావేశమయ్యారు. రైతులకు సున్నా వడ్డీ నిధులు మంజూరు చేసేలా చూడాలన్నారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంచాలన్నారు.అంతకుముందు మండలాల సిబ్బందితో వీక్షణ సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజీ డీపీఏం సుధాకర్‌, డీపీఏంలు మంజుల, కామాక్షి, రవి, పి.ఎం.రాజు, ఏపీవో సోమయాజులు, శశిధర్‌, స్వీడాప్‌ జేడీఎం హైమావతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.