close

సోమవారం, అక్టోబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండు జిల్లాలకు కొత్త వారధి

కాళంగి నదిపై రూ.10 కోట్లతో వంతెన 
ఎనిమిది కిలోమీటర్ల మేర రోడ్డు ఏర్పాటు 
కేంద్రానికి ప్రతిపాదనలు
న్యూస్‌టుడే, సూళ్లూరుపేట


కాళంగి నదిపై వంతెన నిర్మించే ప్రాంతం

నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దు పల్లెలను కలుపుతూ కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. ఆ మేరకు ఇంజినీర్లు నమూనాలు రూపొందించి.. సంబంధిత ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. సాకారమైతే రెండు జిల్లాల పరిధిలోని అయిదు మండలాల ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. సూళ్లూరుపేట, దొరవారి సత్రం, పెళ్లకూరు మండలాల్లోని ప్రజల అవసరాలను తీర్చనుంది. అధికారులు అనుకున్నట్లు జరిగితే సరిహద్దు రహదారికి మంచిరోజులు వచ్చినట్లే. అవసరమైన నిధులు ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన ద్వారా మంజూరుకానున్నాయి. సూళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాలను కలుపుతూ కొత్త రహదారి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తద్వారా సత్యవేడు నియోజక వర్గంలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ మండలాలకు.. నాయుడుపేటకు దగ్గరి దారి ఏర్పాటు కానుంది. దీంతో పాటు సూళ్లూరుపేట మండలంలోని పడమటి పల్లెలైన సుగ్గుపల్లి, వెలగలపన్నూరుతోపాటు, దొరవారిసత్రం మండలంలోని తుంగమడుగు, వెదురుపట్టు గ్రామాలకు నాయుడుపేటకు దారి వసతి కలగనుంది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారి వరకు చక్కటి మార్గం ఏర్పాటు కానుంది. ఇందు కోసం అధికారులు రూ. 15 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. 
ఎక్కడి నుంచి ఎక్కడికి .. 
సూళ్లూరుపేట మండలం వెలగలపన్నూరు సమీపంలో ఇలుపూరు-తుంగమడుగు రహదారి నుంచి దొరవారిసత్రం మండలంలోని వెదురుపట్టు, దుబ్బాలవారికండ్రిగ, నరసమాంబపురం, అర్థమాల, పుత్తేరి మీదుగా పునబాక వరకు (చెంబేడు ర.భ.శాఖ రహదారి వరకు) ఎనిమిది కిలోమీటర్ల కొత్త రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు చేశారు. నరసమాంబపురం పక్కనే కాళంగి నది ఉంది. దీన్ని దాటితే అవతలి గ్రామాలొస్తాయి. దీంతో కాళంగి నదిపై 150 మీటర్ల మేర వంతెన నిర్మాణానికి డిజైన్‌ చేశారు. రెండు వైపులా కొంత సిమెంటు, తారురోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదించారు. వంతెన నిర్మాణానికి రూ.10 కోట్లు, రహదారి నిర్మాణానికి రూ.5 కోట్ల వ్యయమవుతుందని అంచనా. త్వరలోనే నిధులు మంజూరయ్యే అవకాశముంది. రోడ్డు వేస్తే.. దొరవారిసత్రం, సూళ్లూరుపేట, బీఎన్‌కండ్రిగ, వరదయ్యపాళెం మండలాల ప్రజలు నెల్లూరు చేరేందుకు దగ్గరవుతుంది.
అది ఎలాగంటే..: వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ మండలాలకు చెందిన వారు ప్రస్తుతం నాయుడుపేట, నెల్లూరుకు వెళ్లేందుకు శ్రీకాళహస్తి, సూళ్లూరుపేటకు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. కొత్త రహదారితో వరదయ్యపాళెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజానీకం పాలేడు, సుగ్గుపల్లి, వెలగలపన్నూరు మీదుగా నరసమాంబపురం నుంచి నాయుడుపేటకు చేరుకునే వీలుంది. 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.