close

సోమవారం, అక్టోబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జేబు కత్తిరించి.. రూ.2.04 లక్షలు కాజేసి

బిట్రగుంట, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి జేబు కత్తిరించి రూ.2.04 లక్షలు దోచుకెళ్లిన సంఘటన బోగోలు మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం మెట్టగౌడవారిపాళేనికి చెందిన దాసరి రవిచంద్రబాబు వేరుసెనగ కాయల యంత్రం కొనుగోలు చేసేందుకు బుధవారం విడవలూరు, బోగోలు మండలాల్లోని వివిధ గ్రామాల్లో తిరిగారు. ఎక్కడా యంత్రం నచ్చకపోవడం, రాత్రివేళ కావడంతో కప్పరాళ్లతిప్ప ఎఫ్‌సీఐ గోదాముల సమీపంలో తన కారులోనే నిద్రపోయారు. ఆ సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ప్యాంట్‌ జేబును కత్తిరించి అందులో ఉన్న రూ.2 లక్షలు, చొక్కా జేబులో ఉన్న రూ.4,500 అపహరించుకుపోయారు. గురువారం ఉదయం లేచిచూసేసరికి నగదు మాయం అవడంతో బాధితుడు బిట్రగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కావలి డీఎసీ్పీ ప్రసాద్‌, గ్రామీణ సీీఐ అక్కేశ్వరరావు ఘటనపై ఆరా తీశారు. ఎస్సై సుమన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కౌరుగుంటలో భారీ చోరీ..

కౌరుగుంట(దగదర్తి) : మండలంలోని కౌరుగుంటలో గురువారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఓ ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని 15 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు అపహరించుకుపోయిన సంఘటన మండలంలోని కౌరుగుంటలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన కమలమ్మ.. మనుమడితో కలసి తన ఇంట్లో ఉండేవారు. అతడికి ఇటీవల వివాహం అయి అత్తారింటికి వెళ్లడంతో ఆమె కుమార్తె ఇంటి వద్ద ఉంటున్నారు. దీన్ని గుర్తించిన దుండగులు కమలమ్మ ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని రూ.8లక్షల విలువ చేసే 15 సవర్ల బంగారం, రూ.2లక్షల నగదును దోచుకెళ్లారు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని బుచ్చిరెడ్డిపాళెం సీీఐ సురేష్‌, ఎస్సై సుబ్బారావు పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.