close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రజల ప్రాణాలతో చెలగాటమా!

రసాయన కర్మాగారం ఎదుట ధర్నా

బైఠాయించి ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

వింజమూరు, న్యూస్‌టుడే: చంద్రపడియ వద్దనున్న వెంకట నారాయణ యాక్టివ్‌ ఇన్‌గ్రీడియంట్స్‌ రసాయన కర్మాగారాన్ని వెంటనే మూసివేయాలంటూ సమీప గ్రామాల ప్రజలు మంగళవారం ఫ్యాక్టరీ ఎదుటధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు సంస్థ యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యం కారణంగానే బాయిలర్‌ పేలిన సంఘటనలో ఇద్దరు మృతి చెందగా- మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని ఆవేదన చెందారు. కర్మాగారంలో పనులు జరుగుతున్నాయని.. కలెక్టర్‌ 15 మంది సిబ్బందికి అనుమతిస్తే... ఫ్యాక్టరీ బయట 50కి పైగా ద్విచక్ర వాహనాలు ఉండటమే అందుకు సాక్ష్యమని అన్నారు. కర్మాగారంలోని పలువురు ఉద్యోగులకు కరోనా సోకిందని, ఆ వైరస్‌ సమీపంలోని గ్రామంలోకి సోకే అవకాశం ఉందని,ఫ్యాక్టరీ మాకొద్దంటూ నినదించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి, తహసీల్దారు సుధాకరరావు, ఎస్సై బాజిరెడ్డి ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. ఆర్డీవో వారిని శాంతింపజేశారు. ఇకపై పోలీసు అవుట్‌ పోస్టు ఏర్పాటు చేసి 15 మందినే లోపలికి అనుమతిస్తామని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కర్మాగారంలో శానిటైజర్లు ఎక్కువగా ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. సాగునీటి కాలువల కలుషితంపై నివేదిక కోరతామన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రపడియ, బుక్కాపురం, తొగటపాలెం, తిమ్మానాయుడుపల్లె గ్రామాల ప్రజలు ధర్నాలో పాల్గొన్నారు.

కమిటీ దర్యాప్తు ప్రారంభం

వింజమూరు : చంద్రపడియ రసాయన కర్మాగారంలో గత నెల 29న జరిగిన ప్రమాదంపై ముగ్గురు అధికారుల కమిటీ మంగళవారం దర్యాప్తు ప్రారంభించింది. కమిటీలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ప్రమోద్‌కుమార్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ ఎన్‌.శివశంకర్‌రెడ్డి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి కె.శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు. వీరు కర్మాగారంలోని అన్ని విభాగాలను క్షుణ్నంగా పరిశీలించి.. పూర్తి అధ్యయనం తర్వాత జిల్లా కలెక్టర్లకు నివేదిక ఇవ్వనున్నారు.

ప్రత్యేక విచారణాధికారిగా కలిగిరి సీఐ..

కర్మాగారంలో జరిగిన ప్రమాదంపై విచారణకు ప్రత్యేక అధికారిగా కలిగిరి సీఐ జీఎల్‌ శ్రీనివాసరావును ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ నియమించారు. ఆయన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ వారు విచారణకు హాజరు కావాలని కోరారు. కావలి డీఎస్పీ ప్రసాద్‌ కర్మాగారాన్ని పరిశీలించారు.

మరొకరి మృతి

అనుమసముద్రంపేట, వింజమూరు : చంద్రపడియ సమీపంలోని కర్మాగార ప్రమాదంలో గాయపడి చెన్నైలో చికిత్స పొందుతున్న రజనీకాంత్‌(34) సోమవారం రాత్రి మృతి చెందారు. ప్రమాదంలో తొలుత హఫీజ్‌ మృతి చెందగా ప్రస్తుతం రజనీకాంత్‌ దుర్మరణం చెందారు. దీంతో ఆయన స్వగ్రామం పెద్దబ్బీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య శ్రీవాణి ప్రస్తుతం గర్భిణి. మృతి సమాచారం విని ఆమెతో పాటు బాధిత కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.