close

గురువారం, సెప్టెంబర్ 24, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శ్రీవారికి శ్రవణానక్షత్ర అభిషేకం

నెల్లూరు(సాంస్కృతికం), పొదలకూరు : శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని దర్గామిట్టలోని తితిదే కల్యాణ మండపంలో మంగళవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామికి కమనీయంగా వేదపండితులు వేదగిరి ఫణిశర్మ అభిషేకాలను నిర్వహించారు. ః పొదలకూరు శ్రీనివాసనగర్‌లోశ్రీలక్ష్మీవెంకటేశ్వరస్వామి బాలాలయం సన్నిధిలో మంగళవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాస కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. 
విద్యకు పెద్దపీట : కాకాణి 
మనుబోలు : విద్యా రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ‘నాడు-నేడు’ పథకం పనులపై అధికారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష జరిపారు. కొత్తగా మంజూరైన పింఛన్లు, బియ్యం కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిధులు దుర్వినియోగం చేయకుండా చూడాలన్నారు. తహసీల్దారు నాగరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, విద్యాశాఖాధికారి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 
నిబంధనలు తూచ్‌..
పొదలకూరు : ఈనెల 15న ఇళ్ల పట్టాలు ఇస్తున్న గ్రామంలో సచివాలయం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఫొటోలు, ఆధార్‌ కార్డులు ఇచ్చి తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు. అసలే కరోనా కేసులతో భయపడుతుంటే ఇక్కడ నిబంధనలను ఉల్లంఘించారు. భౌతికదూరం పాటించలేదు. ఈ విషయమై తహసీల్దారు స్వాతి మాట్లాడుతూ మండలంలో 3446 మందికి నివేశన స్థలాల పంపిణీకి డాక్యుమెంట్లు సిద్ధం చేసినట్లు ఆమె చెప్పారు.  

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.