close

శుక్రవారం, ఆగస్టు 07, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

1450 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత

గోదాములో బియ్యం పరిశీలిస్తున్న విజిలెన్సు అధికారులు

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని పేదల వద్ద కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే అందిస్తుండగా జిల్లా కేంద్రమైన నెల్లూరులో విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు పట్టుకున్నారు. అయిదు లారీల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో రూ.40 లక్షల విలువైన 1450 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బద్వేల్‌ నుంచి లక్ష్మీనరసింహ రైస్‌మిల్లు పేరుతో, ప్రకాశం జిల్లా మేదరమిట్ల నుంచి మూడు లారీలు నెల్లూరులోని టీపీ గూడూరులో రాజరాజేశ్వరి ఆగ్రో ఇండస్ట్రీస్‌ మిల్లు పేరుతో, నెల్లూరులోని శ్రీలక్ష్మీకామాక్షి రా అండ్‌ బాయిల్డ్‌ రైస్‌మిల్లు పేరుతో వెంకటేశ్వరపురంలోని ఎఫ్‌సీఐ గోదాములో అన్‌లోడింగ్‌ చేస్తున్నారు. సమాచారం అందుకున్న విజిలెన్సు అధికారులు దాడులు నిర్వహించారు. బిల్లుల పేరుతో ఉన్న మిల్లుల వద్ద తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఇతర జిల్లాల నుంచి బియ్యం ఇక్కడకు తరలించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ధాన్యాన్ని అధిక ధరకు విక్రయిస్తూ పీడీఎస్‌ బియ్యాన్నే తిరిగి ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నట్లు పరిశీలనలో తేలింది. ఒక్కో లారీలో 580 బస్తాలు ఉన్నాయి. లారీలను సీజ్‌ చేశారు. డ్రైవర్లు, మిల్లు యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోవూరు పోలీసులకు విజిలెన్సు అధికారులు సిఫార్సు చేశారు. దాడుల్లో విజిలెన్సు, ఎన్‌ఫోర్సుమెంట్‌ ఇన్‌ఛార్జి ఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి, సీఐలు మాణక్యాలరావు, సుధాకర్‌రెడ్డి, నారాయణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.