close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా కలెక్టర్‌గా కేవీఎన్‌ చక్రధర్‌బాబు

ఈనాడు, నెల్లూరు: జిల్లా కలెక్టర్‌గా కేవీఎన్‌ చక్రధర్‌బాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఏపీ ట్రాన్స్‌కో జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2011 బ్యాచ్‌కు చెందిన ఆయన.. అయిదేళ్ల కిందట నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేశారు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే గుర్తింపు ఉన్న ఆయన అప్పట్లో పాలన పరంగా తమదైన ముద్ర వేసుకున్నారు. నెల్లూరు నగరపాలికలో రోడ్ల విస్తరణ నుంచి పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. నెల్లూరు నగరపాలక సంస్థలో నియమితులైన తొలి ఐఏఎస్‌ ఈయనే కావడం గమనార్హం.

పోస్టింగ్‌ ఇవ్వని ప్రభుత్వం.. ఇప్పటి వరకు కలెక్టర్‌గా పనిచేసిన ఎంవీ శేషగిరిబాబుకు ప్రస్తుతం ప్రభుత్వం పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆయన్ను జీఏడీలో రిపోర్టు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 జూన్‌లో జిల్లా కలెక్టర్‌గా వచ్చిన శేషగిరి బాబు.. సరిగ్గా ఏడాదిపాటు జిల్లాలో పనిచేశారు. ప్రభుత్వ పథకాలు పక్కాగా అమలు చేయడం నుంచి ప్రజల సమస్యలపై చొరవ చూపడం వరకు అనేక రీతుల్లో పాలనపరంగా తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నెల్లూరులో నమోదైన క్రమంలో యుద్ధ ప్రాతిపదికన అధికారులను సన్నద్ధం చేశారు. ఎప్పటికప్పుడు సమీక్షలతో కేసులు పెరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. రాజకీయంగా ఒత్తిళ్లు ఎక్కువ కావడం, కొందరు నేతలతో సఖ్యత కరవవడం, ఈ పరిణామాల నేపథ్యంలో బదిలీ కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. సోమవారం నుంచి సెలవులో ఉండగా ఇక జిల్లాకు తిరిగి రారన్న ప్రచారమూ జరిగింది. ఈ స్థితిలో ప్రస్తుతం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇద్దరు ఐఏఎస్‌ అధికారుల పేర్లు జిల్లాకు వచ్చే జాబితాలో బలంగా వినిపించినా అనూహ్యంగా చక్రధర్‌బాబును నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.