close

శుక్రవారం, ఆగస్టు 07, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లాలో హోం ఐసోలేషన్‌ ప్రారంభం

మాట్లాడుతున్న జేసీ ప్రభాకరరెడ్డి

నెల్లూరు(నగరపాలకసంస్థ, వైద్యం), న్యూస్‌టుడే: జిల్లాలో హోం ఐసోలేషన్‌, హోం క్వారంటైన్‌లను ప్రారంభించినట్లు జాయింట్‌ కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ కొవిడ్‌-19 స్వల్ప లక్షణాలు కలిగిన 7 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచామని తెలిపారు. జిల్లాకు 1900 స్టాండర్డ్‌ క్యూ కొవిడ్‌-19 ఏజీ కిట్లు వచ్చాయని, వీటి ద్వారా అనుమానాస్పద లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి, 15 నుంచి 30 నిమిషాల్లోపు ఫలితం వెల్లడించనున్నట్లు చెప్పారు. జిల్లాకు రెండు ట్రూనాట్‌ ల్యాబ్‌లు మంజూరయ్యాయని తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలను తప్పనిసరిగా నిర్వహించి, హోం క్వారంటైన్‌కు తరలించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. డీఈవోసీలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి, డెమో మీనాకుమారి తదితరులు పాల్గొన్నారు. సచివాలయాల పరిధిలో ఆన్‌లైన్‌ మ్యాపింగ్‌ను పక్కాగా చేయాలని జేసీ ఎన్‌.ప్రభాకరరెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పరిషత్‌ ఆవరణంలోని డీఈవోసీలో మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కలెక్టరేట్‌ను వదలని కరోనా

కరోనా కలెక్టర్‌ను వదలడం లేదు. కలెక్టరేట్‌లో పనిచేసే పలువురు ఉద్యోగులకు కొవిడ్‌--19 పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో చాలా మంది ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగులు ఇళ్ల వద్ద నుంచే పనిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో 208 కంటైన్‌మెంట్‌ జోన్లు

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన 208 ప్రాంతాలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్లుగా గుర్తించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో జోన్లను పెంచారు.

ఆసుపత్రుల్లో వసతులు

కొవిడ్‌ ఆసుపత్రుల్లో వసతులు, వైద్య సిబ్బంది, వైద్య పరీక్షల ల్యాబ్‌లపై దృష్టి సారించాలని వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు. శనివారం రాత్రి విజయవాడ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జడ్పీలోని డీఈవోసీలో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు, జాయింట్‌ కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌లు వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్‌, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కూరగాయల వ్యాపారుల ఆరోగ్య పరిస్థితులపై ప్రతిరోజు వివరాలు వైద్యాధికారులకు నివేదించాలని మార్కెటింగ్‌ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్‌ టి.బాపిరెడ్డి, ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, జడ్పీ సీఈవో సుశీల, డీపీవో ధనలక్ష్మి, డీఎంఅండ్‌హెచ్‌వో రాజ్యలక్ష్మి, డీసీహెచ్‌ఎస్‌ చెన్నయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.