close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గ్రామీణ రహదారులకు మహర్దశ

టెండర్లకు ర.భ. అధికారులు

ఎన్‌డీబీ పనుల్లో కదలిక

230 కి.మీల మేర విస్తరణ


రెండు వరుసలు కానున్న కోట - నాయుడుపేట రహదారి

మండలాల నుంచి జిల్లాలకు రహదారుల అనుసంధానం పెరగనుంది. మండల కేంద్రాల నుంచి మరో మండల కేంద్రానికి వెళ్లే రహదారుల రెండు వరుసలుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ పథకానికి గత ప్రభుత్వంలో రూపకల్పన చేయగా న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణ సాయానికి ముందుకొచ్చింది. ఎన్నికల ముందు పనులు ఆగడంతో మళ్లీ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడానికి చర్యలు చేపట్టింది. ర.భ శాఖ నుంచి సవివర నివేదిక అందించడంతో ప్రభుత్వం టెండర్ల నిర్వహణకు చర్యలు చేపట్టింది. దీంతో గ్రామీణ రహదారులపై ఆశలు చిగురించాయి. ఇందులో రుణం 70 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతంగా ఉంటోంది. ఇలా వచ్చే మూడేళ్లలో పనులు పూర్తి చేయడానికి నిర్ణయించారు.

న్యూస్‌టుడే, పెళ్లకూరు, గూడూరుపట్టణం

జిల్లాల్లో వివిధ శాఖల పరిధిలో 8,414.66 కి.మీ రహదారులున్నాయి. వీటిల్లో జాతీయ రహదారులు మొత్తం బీటీ కాగా స్టేట్‌ హైవేస్‌లో సీసీ, బీటీ రహదారులున్నాయి. జిల్లా మేజర్‌ రహదారులు సీసీ, బీటీ రహదారులు ఉన్నాయి. స్టేట్‌, జిల్లా రహదారులు ర.భ పరిధిలో ఉన్నాయి. ఆయా శాఖల్లో సీసీ రహదారులు 437.70 కి.మీలు కాగా బీటీ రహదారులు 4,701.00 కి.మీ, మెటల్‌ రహదారులు 590.91 కి.మీలు అన్‌మెటల్డ్‌ రహదారులు 2,685.05 కి.మీలు ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా గ్రామీణ రహదారులు అన్‌మెటల్డ్‌ రహదారులు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి గతేడాది నిధులు మంజూరు కాగా పనుల్లో కదలిక లేకుండా ఉంది. ర.భ పరిధిలోని రహదారుల్లో సింగిల్‌ లేన్‌ రహదారులు ఇక రెండు వరుసలు కానున్నాయి. దీంతో మండలాల నుంచి జిల్లాకు వేగంగా వాహనాలు వెళ్లనున్నాయి. గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. గ్రామీణ ప్రాంతాల్లో రద్దీ ఉండే రహదారులను రెండు వరుసలు చేయనున్నారు. ఇలాంటి రహదారుల ఎంపిక బాధ్యత రహదారులు-భవనాల శాఖ శాఖ చూస్తోంది. జిల్లాల్లోని పట్టణ ప్రాంతాలకు అనుసంధానంగా ఉండే రహదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మండల కేంద్రాలకు అనుసంధానం కల్పించే చర్యలు చేపట్టనున్నారు. ఇలాంటి రహదారుల్లో నాయుడుపేట-కోట రహదారి మార్గంలో రెండు కి.మీలు విస్తరించకుండా వదిలేశారు. ఈ రహదారిని విస్తరించే అవకాశముంది. నాయుడుపేట మండలం మర్లపల్లి నుంచి జాతీయ రహదారి వరకు దాదాపుగా 2.5 కి.మీ విస్తరించాల్సి ఉంది. పెళ్లకూరు మండలంలో రద్దీగా ఉండే రహదారి శిరసనంబేడు-చెంబేడు రహదారి దీనిని ఇటీవల అభివృద్ధి చేశారు. దీనిని కూడా రెండు వరుసలుగా అభివృద్ధి చేసే అవకాశముంది. ఈ మార్గంలో పరిశ్రమలకు వాహనాలు రాకపోకలు పెరిగాయి. చిత్తూరు జిల్లాలోని తొట్టంబేడు మండలంలో పలు పరిశ్రమలు ఏర్పాటు కాగా ఇక్కడకు రాకపోకలు పెరిగాయి.

రూ.532 కోట్ల మేర ఖర్చు

రాష్ట్రంలో 1,240 కి.మీ మేర రూ. 2,978 కోట్లు వెచ్చించనున్నారు. జిల్లాలో దాదాపుగా 230 కి.మీల మేర రహదారులు రెండు వరుసలు చేసే అవకాశం ఉంది. వీటికి కిలోమీటరకు రూ. 2.13 కోట్ల మేర వెచ్చించనున్నారు. నీటివనరులున్న ప్రాంతాల్లో పైవంతెనలు ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తంగా రూ. 532 కోట్ల మేర వెచ్చించే అవకాశముంది. వీటిని నిర్మించిన గుత్తేదారులే ఐదేళ్ల పాటు నిర్వహణ బాధ్యత కూడా తీసుకోవాల్సి ఉంటోంది. వివిధ మండల కేంద్రాల నుంచి రహదారులు పట్టణాలకు అక్కడ నుంచి జిల్లా కేంద్రాలకు రహదారుల్లో వాహనాలు వేగంగా వెళ్లడానికి ఆస్కారం కలుగుతోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.