close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

ఐసోలేషన్‌ వార్డు పరిశీలన

ఉదయగిరి, న్యూస్‌టుడే : మండల కేంద్రమైన ఉదయగిరిలో ఏర్పాటుచేసిన ఐసోలేషన్‌ వార్డుని ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి ఆదివారం పరిశీలించారు. కరోనా నివారణ చర్యలపై తహసీల్దారు బీమా ప్రసాద్‌, వైద్యశాల డాక్టర్లతో మాట్లాడారు. 100 పడకలతో వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్యులు మాళవిక, సంధానీబాషా తదితరులు పాల్గొన్నారు. ● విధి నిర్వహణలో ఉన్న ఎస్సై జ్యోతి, పోలీసు సిబ్బందికి ఉదయగిరి పట్టణానికి చెందిన యువకులు హరిహర, వసీం, ఇర్షాద్‌ ఆదివారం మజ్జిగ అందజేశారు. ● ఉదయగిరిలో ఠాణాకు ఎదురుగా ఉండే మాంసం దుకాణాల వద్ద జనం గుంపులుగా దర్శనమిచ్చారు. ● వైకాపా నాయకుడు మూలె వినయ్‌కుమార్‌రెడ్డి జి.కొత్తపల్లి, ఎస్టీ కాలనీ, లింగమనేనిపల్లి గ్రామాల్లో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఆయన సతీమణి పద్మజారెడ్డి, ఉదయగిరి సీఐ సత్యనారాయణ, ఎస్సై జ్యోతి, మాజీ సర్పంచులు మూలె సుబ్బారెడ్డి, అక్కుల్‌రెడ్డి, కంబాల నరసింహారెడ్డి చేతులమీదుగా ఎస్టీ కాలనీలో కూరగాయలు పంపిణీ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే బియ్యం, కందిపప్పు కోసం దుకాణాల వద్ద ప్రజలు ఎండలో నిలబడలేక సంచులను క్యూలైన్లలో పెట్టి వారి వంతు కోసం ఎదురు చూశారు. తహసీల్దారు బీమా ప్రసాద్‌ పంపిణీని పర్యవేక్షించారు. ● జడ్పీ మాజీ ఛైర్మన్‌ పి.చెంచలబాబుయాదవ్‌ నివాసంలో తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని తెదేపా నాయకులు నిర్వహించారు. సీహెచ్‌.బయ్యన్న, ఆగరా సుబ్రమణ్యం, నాయకులు పాల్గొని నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనుమానిత వ్యక్తి నెల్లూరుకు తరలింపు

ఉదయగిరి : మండలంలోని ఒక గ్రామానికి చెందిన కరోనా అనుమానిత వ్యక్తిని ఆదివారం రాత్రి వైద్యారోగ్య శాఖ అధికారులు ఉదయగిరి సీహెచ్‌సీకి పిలిపించారు. అక్కడ నుంచి నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు. ఆ వ్యక్తి ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చారు.

సీతారామపురం : దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని తహసీల్దారు నిర్మలానందబాబా, ఎస్సై రవీంద్రనాయక్‌ సూచించారు. సరకుల పంపిణీని తహసీల్దారు నిర్మలానందబాబా సీతారామపురంలో ప్రారంభించారు. ● ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆత్మకూరు ఆర్డీవో ఉమాదేవి సూచించారు. నారాయణప్పపేట, చిన్నాగంపల్లిలో కోవిడ్‌-19 చెక్‌పోస్టులను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. సీతారామపురం, ఉదయగిరి మండలాల్లో చౌకదుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం, కందిపప్పు అందిస్తున్నట్లు తెలిపారు.

కలిగిరి : లబ్ధిదారులందరికీ రేషన్‌ సరకులు అందుతాయని, ఒక్కసారిగా డీలర్ల వద్దకు రావొద్దని తహసీల్దారు ఉమాదేవి సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు ముందుగా రేషన్‌ సరకుల పంపిణీ చేయాలని సూచించడంతో ఆదివారం ఉదయం ఆరు గంటలకే కార్డుదారులు కేంద్రాల ఎదుట బారులు తీరారు. ఎస్సై వీరేంద్ర సిబ్బందితో గ్రామాల్లో పర్యటించారు.

జలదంకి : గౌరవరం మేజర్‌ కాలువ గట్టుపై నివసించే చల్లా యనాదులకు భాజపా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుట్టుబోయిన మాదవరావు యాదవ్‌ ఆహార పొట్లాలను ఆదివారం పంపిణీ చేశారు. ● విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో ఆదివారం కుక్కలు దాడి చేయడంతో ద్విచక్రవాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో చోదకుడు కుట్టుబోయిన మహేంద్రకు గాయాలయ్యాయి. జలదంకి ఏఎస్సై వెంకటేశ్వర్లు బాధితుడిని జలదంకి పీహెచ్‌సీకి తరలించారు.

వరికుంటపాడు : చౌకదుకాణాల వద్ద సామాజిక దూరం పాటించాలని తహసీల్దారు శ్రీనివాసులు, ఎస్సై ఉమాశంకర్‌ సూచించారు.

పొట్టిపల్లి(కొండాపురం) :నిప్పంటుకుని సుమారు 100 ఎకరాల్లో కంది పంట దగ్ధమైన ఘటన పొట్టిపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. సుమారు 60 మంది వరకు పంట సాగుచేశారు.

వింజమూరు : మాజీ జడ్పీటీసీ సభ్యుడు తిప్పిరెడ్డి నారపరెడ్డి, వైకాపా నాయకుడు పల్లాల కొండారెడ్డి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు ఆదివారం నిత్యావసర సరకులు అందజేశారు. పోరెడ్డి జగన్‌రెడ్డి భోజన పొట్లాలను అందించారు. ముస్లిం హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ట్రస్ట్‌ వారు పేదలకు ఆహారం అందించారు. వైద్యారోగ్య, పోలీస్‌ శాఖల సిబ్బందికి వాటర్‌ బాటిళ్లను అందజేస్తున్నట్లు ట్రస్ట్‌ ప్రతినిధి ఎస్‌కే రఫీ తెలిపారు. ● ఏప్రిల్‌ 15 వరకు రేషన్‌ సరకులు అందిస్తామని తహసీల్దారు సుధాకర్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.