close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

భోజనం, కూరగాయల సరఫరా
భోజన ప్యాకెట్లు అందజేస్తున్న కాకాణి

వెంకటాచలం, న్యూస్‌టుడే: మండలంలోని కసుమూరు దర్గా వద్ద యాత్రికులు భోజనం కోసం ఇబ్బందులు పడుతుండగా కాకాణి సొంత నిధులతో వారికి భోజనం ఏర్పాటుచేశారు. కసుమూరు, కనుపూరు గ్రామాల్లో రేషన్‌ దుకాణాల్లో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. వెంకటాచలంలోని జాతీయ రహదారిపై ఎస్సై కరీముల్లా ఆధ్వర్యంలో స్థానిక యువకులతో కలిసి అవగాహన కల్పించారు. సరస్వతినగర్‌లో యువత పారిశుద్ధ్యం మెరుగు కార్యక్రమాలు చేపట్టారు.

పిడతాపోలూరు(ముత్తుకూరు) : రైతులు సాయం చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పిడతాపోలూరులో రేషను బియ్యంతోపాటు కూరగాయలు పంపిణీ చేశారు. దువ్వూరువారిపాలెం గ్రామానికి చెందిన రైతు దువ్వూరు చంద్రశేఖర్‌రెడ్డి రూ.లక్ష చెక్కు అందజేసి, 5 టన్నుల ధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్‌ మెట్టా విష్ణువర్దన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

పేదలకు ఆహారం

పొదలకూరు : పట్టణంలో నిరాశ్రయులైన పేదల కోసం భాజపా, సేవాభారతి సభ్యులు కలిసి ఆదివారం భోజన పొట్లాలు అందించారు. రామందిరం, మసీదు ప్రాంతాల్లో నివసించే యాచకులకు వీటిని అందించారు. పట్టణంలో పోలీసులకు స్థానిక యువకులు రవికుమార్‌, శివకుమార్‌, అశోక్‌లు ఆదివారం ఉచితంగా మాస్క్‌లను ఎస్సై రహీంరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

బియ్యం పంపిణీ

పొదలకూరు : గ్రామంలోని నర్సారెడ్డి కాలనీలో చౌకడిపో దుకాణం ద్వారా ఆదివారం రేషన్‌ సరకులు పంపిణీ చేశారు. ఉదయం ఆరు గంటలకు సరకులు దుకాణాలకు చేరుకున్నా పది గంటల వరకు కూడా సంబంధిత సిబ్బంది హాజరు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సామాజిక దూరం అవసరం

మనుబోలు : సరకులు తీసుకోవడంలో సామాజిక దూరం పాటించాలని తహసీల్దారు ఆనందరావు పేర్కొన్నారు. మనుబోలు, వెంకన్నపాలెం, బద్దెవోలు తదితర గ్రామాల్లోని రేషన్‌ దుకాణాలను తనిఖీ చేసి సరకుల పంపిణీని పరిశీలించారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సేవలు: వీసీ

కాకుటూరు(వెంకటాచలం) : కరోనా వైరస్‌ నివారణకు ప్రజలకు ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు అవగాహన కల్సించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య సుదర్శనరావు, రిజిస్ట్రార్‌ విజయకృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం సూచించిన ప్రాథమిక జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం చేపట్టే నివారణ చర్యలకు చేయూతనివ్వాలని కోరారు.

తీరంలో పోలీసుల వినూత్న ప్రచారం

కోడూరు (తోటపల్లిగూడూరు) : మండలంలోని కోడూరు సముద్ర తీర ప్రాంతంలో ఎస్సై మనోజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఆదివారం పోలీసులు కరోనాపై వినూత్న ప్రచారం నిర్వహించారు. కోడూరు బీచ్‌కు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటుచేశారు. కరోనా వైరస్‌పై అవగాహన కోసం ప్లకార్డులు ప్రదర్శించారు. బీచ్‌కు ఎవరు రాకుండా చర్యలు తీసుకున్నారు.

దాతలు ఆదుకోవాలి

వరిగొండ (తోటపల్లిగూడూరు) : పేదలు, కూలీలను ఆదుకొనేందుకు దాతలు మందుకు రావాలని నారాయణ వైద్యశాల ఏజీఎం భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. వరిగొండలోని మహాలక్ష్మమ్మ కాలనీలో ప్రైవేట్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.