close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

నిత్యావసరాలకు 11 గంటల వరకే అనుమతి

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ శ్రీధర్‌, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

కావలి పట్టణం, న్యూస్‌టుడే : పట్టణంలో నిత్యావసర సరకుల కొనుగోళ్లకు ఉదయం 11 గంటల వరకే అనుమతి ఉంటుందని సబ్‌ కలెక్టర్‌ శ్రీధర్‌, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆంధ్రా- కర్ణాటక సరిహద్దుల్లోని మత్స్యకారులను ప్రభుత్వం చర్చించి వారిని తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించడం జరిగిందన్నారు. మరికొందరు అధికారుల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. పట్టణంలోని నాలుగో వార్డు రేషన్‌ దుకాణం వద్ద లబ్ధిదారులకు ఆయన రేషన్‌ సరకులను ఆదివారం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్‌ మన్నెమాల సుకుమార్‌రెడ్డి, వైకాపా పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, నాయకులు జనిగర్ల మహేంద్రయాదవ్‌, అనురాధ తదితరులు పాల్గొన్నారు. దగదర్తిలోని రేషన్‌ దుకాణాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేసి రేషన్‌ సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు వరకుమార్‌, మండల వైకాపా నాయకులు మహేష్‌ నాయుడు, వెంకటేశ్వర్లు, శేఖర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.