close

ఆదివారం, జూన్ 07, 2020

ప్రధానాంశాలు

ఆకలి చూపులు ఆదుకునే మనసులు

యాచకుల కడుపు నింపేలా

రెండు పూటలా భోజనం అందించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు

రూ. 15లక్షలు కేటాయించిన కలెక్టర్‌

స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే

కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా జనజీవనం అంతా ఇళ్లకే పరిమితం అయ్యింది. ఎవరూ బయటకు రావడంలేదు. ఈ జనంపై ఆధారపడి జీవిస్తున్న యాచకులు, ఎవరూ లేక రోడ్లపై బతుకు జీవనాన్ని ఈడుస్తున్న అనాధల ఆకలి బాధలు తీర్చడం ఇబ్బంది కరమైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా అధిరులు వారికి రెండు పూటలా కడుపు నింపేలా నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు నగరంతోపాటు అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమాన్ని అమలుచేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ప్రత్యేక్షంగా, పరోక్షంగా లాక్‌డౌన్‌కు సహకరిస్తున్నారు. పనిచేస్తేగానీ.. ఇళ్లు గడవని వారు కూడా ఎంతో మంది జిల్లాలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం, కందిపప్పు పంపిణీ చేస్తామన్నా.. ఇతర నిత్యావసరాలు, కూరగాయాలు కొనే పరిస్థితి వారికి లేదంటే అతిశయోక్తి కాదు.

పేదలకు భోజనం అందజేస్తున్న సీఐ నాగేశ్వరమ్మ

కడుపు నింపేదెవరు

యాచకుల కడుపునింపేదెవరు? అన్నదే ప్రశ్న. ఇదంతా ఒకెత్తైతే జన జీవనంలో నిత్యం కలసిపోయి ఎక్కడ చూసినా మన కళ్లకు కనిపిస్తూ అవకాశం ఉన్నచోటల్లా చేయి చాచి.. యాచించే యాచకులు, ఎవరూలేక రోడ్ల పక్కన, వీధుల్లో, అరుగులపై కాలం వెళ్లదీసే అనాధల పరిస్థితి ఇప్పుడు ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. వారి కడుపు నింపేవారు ఎవరు..? అనే ప్రశ్న లాక్‌డౌన్‌ను పొడిగించాక జిల్లా అధికారుల్లో మొదలైంది. కలెక్టర్‌ శేషగిరిబాబు పరిస్థితిపై కొందరు అధికారులతో చర్చించారు. ప్రభుత్వం తరఫున జిల్లా అధికారుల ఆధ్వర్యంలోనే వారికి మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అందుకు కలెక్టర్‌ శేషగిరిబాబు రూ. 15లక్షలు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. గురువారం సాయంత్రం నెల్లూరు నగరపాలకసంస్థ కమిషనర్‌కు ఆ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం నెల్లూరు నగరమే కాకుండా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఈ తరహాలో యాచకులకు భోజనం సరఫరా చేయాలని, అందుకు జనరల్‌ ఫండ్‌ నుంచి ఖర్చు చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం 144 సెక్షన్‌ కారణంగా వారిని రోడ్లపై కూడా ఉండనీయడంలేదు. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం సమయానికి ఎవరైనా మానవతా మూర్తులు వచ్చి కడుపునిపంకపోతారా..? అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు యువకులు, క్యాటరింగ్‌ నిర్వాహకులు, స్వచ్ఛంద సంస్థలు రోడ్లపై ఉండేవారు, పేదలకు భోజనం, ఉదయం అల్పాహారం సైతం అందజేస్తున్నారు. నెల్లూరు నగర పోలీసులు సైతం రెండు రోజులుగా దేవాలయాలు, చర్చిల వద్ద ఉంటున్న నిరుపేదలకు ఆహారాన్ని అందజేస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.