close

ఆదివారం, ఏప్రిల్ 05, 2020

ప్రధానాంశాలు

మూల్యం చెల్లించారు !

నిర్లక్ష్యం, అజాగ్రత్త

సామాన్యులకు హడల్‌

పోలీసు స్టేషన్లలో ఇదీ తీరు

ఎస్సై, నలుగురు సిబ్బంది సస్పెన్షన్‌ ..2

 నెల్లూరు (వీఆర్సీ సెంటరు), ఉదయగిరి - న్యూస్‌టుడే : పోలీసు శాఖలో సంచలనం. ఎప్పుడూ లేని ఒక్క ఆదేశం. ఒక్కసారిగా అయిదుగురిపై వేటు. జిల్లాలో చర్చనీయాంశమైన సంఘటన చోటు చేసుకుంది. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ తీసుకున్న నిర్ణయంతో పోలీసు శాఖ ఉలిక్కిపడింది. ఉదయగిరి ఎస్సై, మరో నలుగురు సిబ్బందిపై వేటు పడటంతో చర్చకు దారి తీసింది. ఉదయగిరి పోలీసు స్టేషన్‌లో అత్యాచార యత్నం కేసులో నిందితుడిగా ఉన్న ఓ వైద్యుడు పరారవడంతో పోలీసు శాఖలో నెలకొన్న లోపం బయటపడింది. పోలీసులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం, అజాగ్రత్త బట్టబయలు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పోలీసు స్టేషన్లలో జరుగుతున్న యవ్వారం వెలుగులోకి వచ్చింది. స్టేషన్‌లో ఉన్న ఓ నిందితుడు బయటకు ఎందుకు వెళ్లాడు? ఎలా వెళ్లాడు? దీనిపై పోలీసు శాఖలోనే పలు అనుమానాలకు దారి తీశాయి. రంగంలోకి దిగిన జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ ఈ కేసును వ్యక్తిగతంగా దర్యాప్తు చేశారు.

పోలీసు స్టేషన్లలో ఇదీ పరిస్థితి..

పోలీసు స్టేషన్లలో జరుగుతున్న నిర్లక్ష్యం, అజాగ్రత్త వ్యవహారాలు ఉదయగిరి పోలీసు స్టేషన్‌లో జరిగిన సంఘటనతో వెలుగులోకి వచ్చాయి. ఎవరికి వారే యమునా తీరే.. అన్నట్లు పోలీసుస్టేషన్లలో కానిస్టేబుళ్లు వ్యవహరిస్తుంటారు. ఫిర్యాదుదారుల పట్ల అమర్యాదగా మాట్లాడటం, సివిల్‌ కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. ఇరు పార్టీలను కూర్చోబెట్టి కమీషన్లు తీసుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. అర్జీదారులు స్టేషన్లకు వెళ్లాలంటేనే హడలెత్తుతున్నారు. ఓ వైపు స్టేషన్‌ ఖర్చులకంటూ రైటర్లు వసూళ్లకు పాల్పడుతుంటే.. మరోవైపు కానిస్టేబుళ్లు మామూళ్లు ఇవ్వాలంటూ అడుగుతుంటారు. దీంతో చేసేదేమిలేక అర్జీదారులు ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే స్పందనకు వస్తుంటారు. స్థానిక పోలీసుస్టేషన్లలో న్యాయం జరగడం లేదంటూ ఎస్పీని ఫిర్యాదు చేస్తుంటారు.

ఎస్పీ స్వయంగా దర్యాప్తు..

పెంచలకోనలో వైద్యుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఎస్పీ స్వయంగా విచారించినట్లు తెలిసింది. స్టేషన్‌ నుంచి ఎలా పరారయ్యాడనే విషయంపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో జరిగిన తీరుతెన్నులను తెలుసుకున్నారు.ఇటీవల జాతీయ రహదారిపై లారీల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏఎస్సైను సస్పెండ్‌ చేేశారు. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండో సారి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.

నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు : భాస్కర్‌ భూషణ్‌, జిల్లా ఎస్పీ

విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పోలీసు స్టేషన్‌లో పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మర్యాదగా ప్రవర్తించాలి. స్నేహపూర్వకంగా మెలగాలి. అప్పుడే ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కలుగుతోంది. మేమున్నామని భరోసా వస్తుంది. 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.