close

సోమవారం, మార్చి 30, 2020

ప్రధానాంశాలు

కార్పొరేషన్‌లో ఏసీబీ తనిఖీలు

పట్టణ ప్రణాళికలో అవకతవకలపై విచారణ

నెల్లూరు (నగరపాకలసంస్థ), న్యూస్‌టుడే: ఇంటి నిర్మాణ అనుమతులు పారదర్శకంగా ఉండాలని, అవినీతికి తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వ నిర్ణయంతో అవినీతి అంతమవుతుందని అందరూ భావించారు. కానీ అవినీతి రెట్టింపు అయింది. ఆన్‌లైన్లో చేసుకున్న దరఖాస్తులకు నెలల తరబడి అనుమతులు రావడం లేదు. చేసేది లేక కొందరు బాధితులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో తీగ లాగితే డొంకంతా కదిలినట్లుగా అవినీతి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నగర, పురపాలక కార్యాలయాల్లో మంగళవారం అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా పట్టణ ప్రణాళిక విభాగంలో ఫిర్యాదులు అధికంగా వస్తుండటంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ డీఎస్పీ దేవానంద్‌శాంత్రో ఆధ్వర్యంలో కార్పొరేషన్‌కు చేరుకున్న అధికారులు రాత్రి వరకు రికార్డులను తనిఖీలు చేశారు. భవన నిర్మాణాల అనుమతులు, అనధికార నిర్మాణాలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇటీవల అనధికార లేఅవుట్లు, భవంతుల నిర్మాణాలు పెరిగిపోయిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్త సాధారణ తనిఖీల్లో భాగంగానే పట్టణ ప్రణాళిక విభాగంలో రికార్డులను పరిశీలించామని అవకతవకలు ఉంటే ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీఎస్పీ తెలియజేశారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.