close

సోమవారం, మార్చి 30, 2020

ప్రధానాంశాలు

ఎల్‌ఈడీ లైట్ల నిర్వహణపై జిల్లా కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్‌

నెల్లూరు జడ్పీ, న్యూస్‌టుడే: పల్లెసీమల్లోని వీధుల్లో వెలిగే ఎల్‌.ఈ.డి. లైట్ల నిర్వహణ సమర్ధంగా ఉండేందుకుజిల్లా, మండల, గ్రామీణ స్థాయి కమిటీలు వేయనున్నారు. అందులో భాగంగా ముందుగా జిల్లా కమిటీ ఏర్పడింది. జిల్లా కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్‌ శేషగిరిబాబును నియమించారు. ఈ విషయం జిల్లా పంచాయతీ అధికారి ఎం.ధనలక్ష్మి మంగళవారం రాత్రి ప్రకటించారు. జిల్లా కమిటీకి కన్వీనర్‌గా డీపీవో, కమిటీ సభ్యులుగా జడ్పీ సీఈవో, ట్రాన్స్‌కో ఎస్‌ఈ, నెడ్‌క్యాప్‌ జిల్లా మేనేజరును నియమించారు. ఈ కమిటీ సభ్యులు వారానికి ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది. ఓ ప్రైవేటు సంస్థ ప్రస్తుతం ఈ ఎల్‌.ఈ.డి లైట్ల నిర్వహణ చూస్తోంది. అయితే చాలా గ్రామాల్లో పలు లోపాలు, ప్రజల నుంచి ఫిర్యాదులు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లాయి. దీంతో పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారుల సలహామేరకు ఈ కమిటీలను నియమించారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కమిటీ ఈనెల 23వ తేది ఉదయం 10.30కి జిల్లా కలెక్టర్‌ భవనంలో సమావేశం కానుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.