close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

1 నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు
ఇంటర్‌ ప్రయోగ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో చర్చిస్తున్న డీఆర్‌వో మల్లికార్జున

నెల్లూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నాలుగు విడతలుగా ఇంటర్మీడియట్‌ ప్రయోగ (ప్రాక్టికల్‌) నిర్వహించనున్న నేపథ్యంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జి. మల్లికార్జున ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 43 సెంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అందులో నెల్లూరు డివిజన్‌లో 23, కావలి డివిజన్‌లో 15, గూడూరు డివిజన్‌లో 10 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని డీఆర్‌వో తెలిపారు. పరీక్షా కేంద్రాలవద్ద ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలవరకు నిరంతర విద్యుత్‌ అందించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన ప్రథమ చికిత్సా శిబిరాలను ఆయా కేంద్రాలవద్ద ఏర్పాటుచేయాలని ఆయన డీఎంహెచ్‌వోకు సూచించారు. ఆర్టీసీ వారు పది కిలోమీటర్ల పరిధిలో విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు తరలించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గత ఏడాది నిర్వహించిన ప్రాక్టికల్‌ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ, ఆరోపణలు ఎదుర్కొన్న వారెవరికీ విధులు కేటాయించొద్దని ఈసందర్భంగా ఆయన కోరారు. పాక్టికల్‌ పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే 0861-2320312 నంబరుకు కాల్‌ చేసి పరిష్కారం పొందవచ్చని డీఆర్‌వో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐవో శ్రీనివాసరావు, పరీక్షల అబ్జర్వర్‌ బి. వెంకయ్య, వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.