close

శనివారం, సెప్టెంబర్ 19, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మత్తు పదార్థాలకు బానిసలుగా విద్యార్థులు: వీసీ
మాట్లాడుతున్న వీసీ సుదర్శనరావు

వెంకటాచలం, న్యూస్‌టుడే: మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి రొక్కం సుదర్శనరావు తెలిపారు. మండలంలోని కాకుటూరులోని వీఎస్‌యూలో మంగళవారం మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని మత్తు పదార్థాలను పెద్దఎత్తున తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని పట్టి పీీడిస్తున్న సమస్యల్లో ఇది ప్రధానమైనదన్నారు. ఏడాదికి సుమారు 500 మిలియన్‌ డాలర్ల మత్తుపదార్థాల వ్యాపారం జరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులు కూడా వీటికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. రక్షణ శాఖ ఉప సంచాలకురాలు మల్లవరపు బాలలత మాట్లాడుతూ ఉన్నత లక్ష్యాలతో విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వీఎస్‌యూ ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త అల్లం ఉదయ్‌శంకర్‌, రాష్ట్ర ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి రమేష్‌, న్యాయమూర్తి పీీజే సుధ, సెట్నల్‌ సీీఈవో సుస్మిత, పలువురు అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.