close

గురువారం, అక్టోబర్ 01, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దృష్టి పెడితే సంపన్నులే!

పురపాలక సంఘాల్లో భవనాల లెక్కలే వేరు

పన్ను వసూలులో అధికారుల నిర్లక్ష్యం

రాబడికి గండి

గూడూరు పట్టణం, గూడూరు గ్రామీణం- న్యూస్‌టుడే

నగరపాలక, పురపాలక సంఘాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనుమతి తీసుకునేది ఒకటి నిర్మాణం చేపట్టేది మరొకటి. ఆక్రమించి, అతిక్రమించిన నిర్మాణాలు కోకొల్లలు. నిర్మించిన ఇళ్లకు సైతం పన్ను వేయడంలో నిర్లక్ష్య ధోరణి కారణంగా పురపాలక సంఘాలు ఏళ్ల తరబడి ఇంటి, కొళాయి , ఇతర పన్నులను కోల్పోతున్నాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా నగరపాలక, ఆరు పురపాలక సంఘాల పరిధిలో సుమారు రూ.20 కోట్ల మేర ఏటా నష్టపోతున్నారు. బీపీఎస్‌ కింద ఇళ్ల క్రమబద్ధీకరణ గత ఏడాది ముగియడంతో సరైన అవగాహన కల్పించక అర్హులైన ఇంటి యజమానులు సైతం సద్వినియోగం చేసుకోలేకపోయారు. జిల్లా వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో భవనాల క్రమబద్ధీకరణలో లోపాలపై ‘న్యూస్‌టుడే ’కథనం.


ఈ చిత్రం చూడండి. గూడూరు పురపాలక సంఘంలోని సనత్‌నగర్‌ ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమంగా చేపట్టిన నిర్మాణం ఇది. దీనిపై పలువురు ఫిర్యాదులు చేయడంతో పురపాలక అధికారులు అక్రమ కట్టడం అని తేల్చి తొలగించే పక్రియ చేపట్టారు. అంత వరకు బాగానే ఉంది. అనంతరం నిర్మాణం చకచకా పూర్తయింది. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇలాంటి నిర్మాణాలు పురపాలక సంఘాల్లో యథేచ్చగా సాగుతున్నాయి.


పేరుకు మాత్రం బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌లు ఆన్‌లైన్‌లో నామమాత్రంగా లెక్కలు చూపి చేతులు దులుపుకొంటున్నారు. ఇక్కడే మతలబు ఉంది. యజమానులకు, బిల్డర్లకు మధ్య అధికారులు ఒప్పందాల పనులు పూర్తి చేయడం విశేషం. నెల్లూరు నగరపాలక సంస్థ, గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట, కావలి, ఆత్మకూరు తదితర పురపాలక సంఘాల్లో కొన్నేళ్లుగా ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. గతంలో ఇంటి నిర్మాణం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ల పర్యవేక్షణ ఉండేది. పూర్తి చేసి అనుమతులు మంజూరు చేయాలన్నది నిబంధన. దాని ప్రకారంగానే ఇంటి విస్తీర్ణాన్ని బట్టి పన్ను(అసెస్‌మెంట్‌) వేసి అందుకు సంబంధించిన రశీదును యజమానికి ఇవ్వాలి. అందాక బాగుంది. అధికారులు కొన్నేళ్లుగా పన్ను వసూలుపై సక్రమంగా దృష్టి సారించక పోవడంతో పట్టణాలు వచ్చే ఆదాయాన్ని కోల్పోతున్నాయి. ఇలా ఏడాదికి సుమారు రూ.20కోట్ల వరకు నష్టపోతున్నట్లు అంచనా. మరో వైపు పురపాలక , నగరపాలక సంస్థలో బీపీఎస్‌ కింద అర్హులైన ఇంటి యజమానులు నిర్మాణాలను క్రమబద్ధీకరించుకొనేందుకు ప్రభుత్వం సైతం సడలింపు ఇచ్చినా ఆ దిశగా అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.

పరిశీలించి చర్యలు తీసుకొంటాం - ఓబులేసు, కమిషనర్‌, గూడూరు.

గూడూరు పురపాలక సంఘం గ్రేడ్‌-1గా గుర్తింపు పొందింది. విలీన పంచాయతీలు కలవడంతో తాజాగా ఇళ్లు క్రమబద్ధీకరణ చేయాల్సి ఉంది. అధికారులతో ఇప్పటికే చర్చించాం. ఆ దిశగా చర్యలు తీసుకొంటాం. ఇళ్లు క్రమబద్ధీకరణ చేసుకోకపోవడంతో పురపాలక సంఘం ఆదాయం కోల్పోవడం వాస్తవమే.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.