close

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

ప్రధానాంశాలు

నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం : ఎస్పీ  


కరపత్రాలను విడుదల చేస్తున్న ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌, పక్కన డీటీసీ సుబ్బారావు, నగర కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి

 

నెల్లూరు (రవాణా), న్యూస్‌టుడే : రవాణా నిబంధనలు పాటించి వాహనాలను నడపడం ద్వారా ప్రమాదాలను చాలా వరకు తగ్గించుకోచ్చునని జిల్లా ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ అన్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని రవాణా కార్యాలయంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రతా వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ముద్రించిన కరపత్రాలను, బ్రోచర్‌లను ఎస్పీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి ప్రమాదాల నివారణకు అనేక సంస్కరణలను తీసుకొచ్చిందని తెలిపారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు వాహనదారులను, ప్రజలను ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఉద్దేశించినవేనన్నారు. మితిమీరిన వేగంతోనే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నగర కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో రహదారి నియమాలను పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డీటీసీ సుబ్బారావు మాట్లాడుతూ ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ వీరాస్వామి, నగర డీఎస్పీ మల్లికార్జునరావు, ఆర్టీవో సుశీల, ఎంవీఐలు కె. మురళీమోహనరావు, బాలమురళీకృష్ణ, మాధవరావు, ఏఎంవీఐలు, ఏవో మదానీ, శ్రీహరిరావు, పోలీసు, రవాణా సిబ్బంది, ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీరు, లారీ ఓనర్ల సంక్షేమ సంఘం నాయకులు గోపాలరెడ్డి, పి.ఎల్‌. నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.