close

బుధవారం, సెప్టెంబర్ 23, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హమాలీల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం
మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు

భువనగిరి పట్టణం, న్యూస్‌టుడే: హమాలీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు ఆరోపించారు. కొత్త మార్కెట్‌ యార్డులోని గోదాముల వద్ద గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మెలో పాల్గొని మాట్లాడారు. హమాలీలకు కనీస కూలీ రేట్లు చెల్లించకుండా ప్రభుత్వం వారి శ్రమను దోచుకుంటుందన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మహ్మద్‌ ఇమ్రాన్‌, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే: నూతన ఒప్పందం ప్రకారం సివిల్‌ సప్లై హమాలీల కూలీ ధరలను పెంచకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అన్నారు. హమాలీల కూలీ ధరలను పెంచాలనే డిమాండ్‌తో చేపట్టిన సమ్మె గురువారం రెండోరోజుకు చేరుకుంది. భువనగిరిలోని ఎంఎల్‌ఎస్‌ గోదాం వద్ద హమాలీల సమ్మెలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ ఇమ్రాన్‌, గనబోయిన వెంకటేష్‌, పాల్గొన్నారు.

చౌటుప్పల్‌: పౌర సరఫరాల సంస్థ హమాలీలు చౌటుప్పల్‌లో చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం కొనసాగించారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. హమాలీ కార్మికులు పి.శంకరయ్య, కె.శంకరయ్య, నరేశ్‌, యాదయ్య, సంజీవ, బి.శంకరయ్య, స్వామి, అబ్బాస్‌, లింగస్వామి, ఈశ్వర్‌, యాదయ్య, సైదులు, వెంకటయ్య, ధనమ్మ పాల్గొన్నారు.

హమాలీల డిమాండ్లను నెరవేర్చాలి

ఆలేరు: హమాలీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు చెక్క వెంకటేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆలేరులో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం పౌర సరఫరాల హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మెలో పాల్గొని మాట్లాడారు. కూలీని రూ.18 నుంచి రూ.24కు పెంచాలన్నారు. కార్యక్రమంలో కనకయ్య, రాజు, జానమ్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.